ఇంటర్నెట్ లేకుండా G-Pay,Phone Pay వినియోగించొచ్చు.. ఎలానో తెలుసా?

1616

దిశ, డైనమిక్‌బ్యూరో : ప్రస్తుతం ఎక్కడ చూసినా నగదు రహిత లావాదేవీలకే ప్రజలు మొగ్గుచూపుతున్నారు. ముఖ్యంగా నోట్ల ద్వారా కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రతిచోటా ఆన్లైన్ పేమెంట్స్‌ను వినియోగిస్తున్నారు. అయితే, ఆన్లైన్ పేమెంట్స్ చేసే సమయంలో గూగుల్ పే, ఫోన్ పే యాప్‌లు సిగ్నల్ సరిగా ఉండకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక్కో సమయంలో నెట్ వర్క్ ఉండక ట్రాన్సాక్షన్ మధ్యలోనే ఆగిపోతుండటం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. వీటన్నింటికి చెక్ పెట్టి, ఇంటర్నెట్ లేకుండానే ఒక అకౌంట్ నుంచి మరో అకౌంట్‌కి నగదు పంపించడం ఎలానో తెలుసుకుందాం. దీనికోసం ‘*99#’ USSD కోడ్‌ని ఉపయోగించి ఇంటర్నెట్ లేకుండానే UPI పేమెంట్స్‌ని వినియోగించవచ్చు. అయితే, మీ బ్యాంకు అకౌంట్‌కి మోబైల్ నెంబర్ తప్పనిసరిగా లింక్ చేసి ఉండాలి.

మొదటగా.. మీ ఫోన్‌లో డయల్ ప్యాడ్‌ని తెరిచి ‘*99#’ టైప్ చేసి కాలింగ్ బటన్ ప్రెస్ చేయగానే.. మీరు కొత్త మెనూకు నావిగేట్ చేయబడతారు, ఇందులో 1. send money, 2.Request money, 3.Check Balance, 4.My Profile, 5.Pending Requests, 6. Transactions ఆప్షన్లు ఉంటాయి. ఈ ఆప్షన్లలో మీకు కావాల్సినవి ఎంచుకొని.. చివరగా.. మీ UPI పిన్ ఎంటర్ చేస్తే ట్రాన్సాక్షన్ సక్సెస్ అవుతుంది. అయితే పైన తెలిపిన ప్రాసెస్ అంతా ఇంటర్నెట్ లేకుండానే చేయవచ్చు. మరి ఇంకేం… మీరూ ఇలా ట్రై చేసేయండి.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..