శుక్రవారం పంచాంగం, రాశిఫలాలు (30-04-2021)

161
Panchangam Rasi phalalu

శ్రీ ప్లవ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు
చైత్ర మాసం బహుళ పక్షం
తిధి : చవితి రా 12.20 తదుపరి పంచమి
వారం : శుక్రవారం (భృగువాసరే)
నక్షత్రం : జ్యేష్ఠ సా 4.55 తదుపరి మూల
యోగం : పరిఘము మ 12.33
తదుపరి శివం
కరణం : బవ మ 1.27
తదుపరి బాలువ రా 12.20
ఆ తదుపరి కౌలువ
వర్జ్యం : రా 2.26 – 1.57
దుర్ముహూర్తం : ఉ8.10 – 9.00 &
మ 12.21 – 1.12
అమృతకాలం : ఉ 8.39 – 10.09
రాహుకాలం : ఉ 10.30 – 12.00
యమగండం/కేతుకాలం : మ3.00 – 4.30
సూర్యరాశి : మేషం || చంద్రరాశి: వృశ్చికం
సూర్యోదయం : 5.39 || సూర్యాస్తమయం: 6.14

మేషం : ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది .కుటుంబ సభ్యులతో గృహమున ఆనందంగా గడుపుతారు. పాత మిత్రులను కలుసుకుని కొన్ని విషయాలు చర్చిస్తారు. భూ సంబంధిత వివాదాల నుండి బయటపడతారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

వృషభం : స్థిరాస్తి వివాదాలు పరిష్కారమై ధనప్రాప్తి కలుగుతుంది. మిత్రులతో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. నిరుద్యోగులకు వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది వృత్తి, ఉద్యోగమున అధికారుల ఆదరణ పొందుతారు.

మిధునం : ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి డబ్బు అందుతుంది. ఋణ ఒత్తిడి నుండి బయటపడతారు. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. వ్యాపారాలలో ఉన్నతి కలుగుతుంది.

కర్కాటకం : ఇంటబయట సమస్యల నుండి తెలివిగా బయట పడతారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు లాభాలు అందుతాయి. ఆర్థికంగా మరింత అనుకూలత పెరుగుతుంది. వృత్తి వ్యాపారంలో కీలక ఆలోచనలతో ముందుకు సాగుతారు. నిరుద్యోగులకు కొంత ఓర్పుతో వ్యవహరించాలి.

సింహం : కీలక విషయాలలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి వ్యాపారాలలో అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఉద్యోగాలలో కొంత ఒత్తిడి ఉన్నపటికీ పనులు పూర్తి చేస్తారు.

కన్య : మిత్రులతో ఏర్పడిన మనస్పర్ధలు పరిష్కరించుకుంటారు. గృహనిర్మాణ ఆలోచనలలో మందకొడిగా సాగుతాయి. స్ధిరాస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్ధిక పరిస్థితి పుంజుకుంటుంది. దీర్ఘకాలిక రుణాలు కొంతవరకు తీరుతాయి. నిరుద్యోగులు ఆశలు నిజమౌతాయి. ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి.

తుల : ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి ముఖ్యమైన వ్యవహారాలు జాప్యం జరిగిన నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. ఊహించని ఆహ్వానాలు కొంత ఊరట కలిగిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మిత్రుల వల్ల ఆర్ధిక లబ్ది పొందుతారు.

వృశ్చికం : కొన్ని రంగాల వారికీ తగిన గుర్తింపు లభిస్తుంది దీర్ఘ కాలిక వివాదాలు తీరి ఆర్థిక లబ్ది పొందుతారు. సోదరులతో సఖ్యత పెరుగుతుంది. సంఘంలో పెద్దల సహాయం అందుతుంది. వృత్తి వ్యాపారాలలో స్వంత నిర్ణయాలు చేయడం మంచిది. ఉద్యోగమున మిశ్రమ ఫలితాలు ఉంటాయి విద్యార్థులు మరింత కష్టపడాలి.

ధనస్సు : వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు అనుకూల సమయం. నూతన వాహన యోగం ఉన్నది. కీలక వ్యవహారాలలో అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వృధాఖర్చులు అదుపులో ఉంచుకోవాలి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

మకరం : బంధు మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. కోపం అదుపులో ఉంచుకోవడం మంచిది. ఆర్థిక వ్యవహారాలు కొంత ఆశాజనకంగా ఉంటాయి . గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు వ్యాపారమున కొత్త ఆలోచనలు అమలుచేస్తారు. ఉద్యోగమున అదనపు బాధ్యతలు మానసికంగా ఒత్తిడికి గురి చేస్తాయి.

కుంభం : నూతనంగా చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. దూరప్రాంతాల వారి నుండి కీలక సమాచారం అందుతుంది. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. సంతానంవిద్యా, ఉద్యోగఅవకాశాలు లభిస్తాయి ఉద్యోగులకు ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది.

మీనం : మిత్రుల నుంచి అందిన ఆహ్వానాలు ఆశ్చర్య పరుస్తాయి సంఘంలో గౌరవం మర్యాదలు పొందుతారు. వృత్తి, వ్యాపారాలు పెట్టుబడులు పెట్టుటకు అనుకూల సమయం. సోదరుల నుంచి ధన లాభాలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. నిరుద్యోగులకు చాలాకాలంగా ఎదురుచూస్తున్న అవకాశములు అందుతాయి.

 

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..