వారందరికీ ఉచిత విద్యుత్.. ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్

by  |
వారందరికీ ఉచిత విద్యుత్.. ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: అత్యంత వెనుకబడిన వర్గాలకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. అత్యంత వెనుకబడిన వర్గాలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు ప్రకటించింది. బీపీఎల్ కింద ఉన్న స్వర్ణవృత్తిదారులకు, చేనేత కార్మికులకు నెలకు వంద యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు తెలిపింది.

వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇవాళ కొత్త విద్యుత్ టారిఫ్‌ను ఏపీఈఆర్సీ ప్రకటించింది. ఈ మేరకు విద్యుత్ నియంత్రణ మండలి ఛైర్మన్ జస్టిస్ నాగార్జున రెడ్డి వివరాలను మీడియాకు వెల్లడించారు. ఫంక్షన్ హాళ్లకు ఫిక్స్‌డ్ ఛార్జీలు ఇక ఉండవని, గృహ వినియోగదారులకు కనీస ఛార్జీలకు బదులు కిలోవాట్‌కు రూ.10 ఛార్జ్ వసూలు చేస్తామన్నారు. ఇక హరిజన, గిరిజన తండాల్లో నెలకు 20 యూనిట్ల వరకు, లాండ్రీలు నడుపుతున్న రజకసంఘాలకు 150 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు.

కొత్త టారిఫ్ ప్రకారం సగటు యూనిట్ ధర రూ.7.17 నుంచి రూ.6.37కు ప్రభుత్వం తగ్గించింది. ఉచిత విద్యుత్ ఇవ్వడం వల్ల రూ.1,657 కోట్ల భారం పడుతోందని నాగార్జున రెడ్డి తెలిపారు.

Next Story

Most Viewed