4 ఏళ్ల చిన్నారి కిడ్నాప్.. ఆపై

by  |
4 ఏళ్ల చిన్నారి కిడ్నాప్.. ఆపై
X
దిశ, జవహర్ నగర్: ఇంటి నుండి కిరాణా దుకాణానికి వెళ్తున్న నాలుగేళ్ళ చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఆపై చిన్నారిపై పాశవికంగా లైంగిక దాడి చేసి, ప్రగతి నగర్‌లోని వాటర్ టాంకర్ వద్ద వదిలిపెట్టిన సంఘటన జవహర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. సీఐ బిక్షపతి రావు తెలిపిన కథనం ప్రకారం.. దమ్మాయి గూడకు చెందిన మైనర్ బాలిక (4) కుటుంబానికి ఇంటి సమీపంలోనే కిరాణా దుకాణం కలదు. ఆదివారం మధ్యాహ్నం ఇంటి నుండి వారి స్వంత దుకాణానికి వెళ్తున్న క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు చిన్నారిని అపహరణ చేశారు.
షాపు నుండి ఇంటికి చేరుకున్న చిన్నారి తల్లి పాప కనిపించకపోవడంతో కలవరం చెందింది. రాత్రి వరకు పాప ఆచూకీ తెలియక పోవడంతో జవహర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో పాప తల్లి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కిడ్నాప్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం ఉదయం జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి నగర్ వాటర్ ట్యాంక్ వద్ద గాయాలతో పడివున్న చిన్నారిని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయాలతో పడివున్న చిన్నారిపై లైంగిక దాడి జరిగినట్లుగా అనుమానించి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

సీసీటీవీ పుటేజ్ ఆధారంగా…

జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చిన్నారి కిడ్నాప్ కావడంతో పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఘటనా స్థలంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించారు. దర్యాప్తులో భాగంగా అనుమానితున్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Next Story

Most Viewed