- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పండగ పూట ఘోర విషాదం.. ట్రాక్టర్ అదుపుతప్పి నలుగురు మృతి
by Sridhar Babu |
<p>దిశ,పాలేరు: దేవి నవరాత్రుల నిమజ్జనంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ముదిగొండ మండలం బాణాపురం వద్ద శనివారం అర్ధరాత్రి ట్రాక్టర్ బోల్తాపడి కమలాపురం కి చెందిన నలుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. దేవిశరన్నవరాత్రి ఉత్సవాల నిమజ్జన కార్యక్రమానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో అవసాని ఉపేందర్(25), చూడబోయిన నాగరాజు(23) ములకలపల్లి ఉమ(38), బిచ్చల ఎలగొండ స్వామి (50) అనే నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ […]</p>

X
దిశ,పాలేరు: దేవి నవరాత్రుల నిమజ్జనంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ముదిగొండ మండలం బాణాపురం వద్ద శనివారం అర్ధరాత్రి ట్రాక్టర్ బోల్తాపడి కమలాపురం కి చెందిన నలుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. దేవిశరన్నవరాత్రి ఉత్సవాల నిమజ్జన కార్యక్రమానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో అవసాని ఉపేందర్(25), చూడబోయిన నాగరాజు(23) ములకలపల్లి ఉమ(38), బిచ్చల ఎలగొండ స్వామి (50) అనే నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి.
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

- Tags
- ambulance
Next Story






