నలుగురు మావోయిస్టుల లొంగుబాటు..

by  |
నలుగురు మావోయిస్టుల లొంగుబాటు..
X

దిశ, విశాఖపట్నం : విశాఖ పోలీసుల ఎదుట సి.పి.ఐ (మావోయిస్టు) పార్టీ పెదబయలు ఏరియా కమిటీ మెంబరు (ACM), పెదబయలు ఏరియా మావోయిస్టు మిలీషియా కమాండర్ ,ఇద్దరు కోరుకొండ ఏరియా అర్మెడ్ మిలీషియా సభ్యులు మొత్తం నలుగురు సోమవారం విశాఖ రేంజ్‌ డిఐజీ కె.రంగరావు ఎదుట లోంగిపోయారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లా పోలీసు కార్యాలయంలో డిఐజి. కే.వి.రంగారావు, ఎస్పీ బి.కృష్ణారావు మీడియాతో మాట్లాడారు. పెదబయలు మండలం జామిగూడా పంచాయతీ సాకిరేవు గ్రామానికి చెందిన కోర్రా సీత అలియస్‌ స్వర్ణ (ఈమె పై రివార్డు 4 లక్షల రూపాయలు), సాకిరేవు గ్రామానికి చెందిన అజాదు, సుధీర్, లత, భవానీ, వసంత మరికొంత మంది మావోయిస్టులు తరుచుగా వచ్చి మీటింగులు పెట్టేవారని, ఆ మీటింగులలో వారి విప్లవ గీతాలు, మాటలకు ఆకర్షితురాలైయి 2010 లో మావోయిస్టు పార్టీలో చేరిందన్నారు.

ఈమె మావోయిస్టుపార్టీ పెదబయలు ఏరియా కమిటి లో కీలక సభ్యురాలిగా ఉందన్నారు. స్థానిక కోoదు తెగకు చెందినది కనుక మారుమూల గ్రామాల పై మంచి పట్టువుండేది. ఈమె 2010 నుండి మావోయిస్టు పార్టీతో గాలికొండ, కోరుకొండ, పెదబయలు, కటాఫ్, మాచ్ ఖండ్ వంటి ఆంధ్ర ఒడిస్సా సరిహద్దు (ఏఓబి) ప్రాంతాలలో తిరుగుతూ, వివిద హోదాలలో మహిళా సంఘం, జననాట్యమండలి, ఆదివాసీ విప్లవ రైతుకూలి సంఘములలో పనిచేసి, ప్రస్తుతం పెదబయలు దళం ఏరియా కమిటీ మెంబరుగా పనిచేస్తున్నది. పాంగి ముసిరి,కొర్రా వెంకటరావు, పాంగి గోపాలరావులు గత మూడేళ్లుగా మిలిషియా సభ్యులుగా పనిచేస్తున్నారని తెలిపారు. అనంతరం డిఐజి మాట్లాడుతూ ఏవోబి ప్రాంతంలో ఉన్నమావోలు,మిలిషియాసభ్యులు స్వచ్చందంగా లొంగిపోవాలని కోరారు.

Next Story

Most Viewed