TRS పార్టీ నుండి బూర్గంపాడు మాజీ జడ్పీటీసీ సస్పెండ్

by  |
TRS పార్టీ నుండి బూర్గంపాడు మాజీ జడ్పీటీసీ సస్పెండ్
X

దిశ, బూర్గంపాడు : పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు క్రమశిక్షణ చర్యలు కింద బూర్గంపాడు మాజీ జడ్పీటీసీ బట్టా విజయగాంధీని టీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు, మండల టీఆర్ఎస్ పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. శనివారం బూర్గంపాడు మండల కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని పార్టీ నాయకులు తెలిపారు.

గతంలో మండల జడ్పీటీసీ సభ్యులుగా పని చేసిన బట్టా విజయగాంధీ, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా ఉంటూనే పార్టీని కాదని, ములుగు ఎమ్మెల్యే సీతక్కతో కలసి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో రహస్య సమావేశం నిర్వహించారని తెలిపారు. దీంతో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలలో గందరగోళాన్ని సృష్టించే విధంగా వ్యవహరించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు బూర్గంపాడు మండల టీఆర్ఎస్ పార్టీ బట్టా విజయ గాంధీపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని నిర్ణయంచి, పార్టీ నుండి బహిష్కరించాలని తీర్మానించినట్లు వెల్లడించారు.

Next Story