- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డిప్యూటీ సీఎంల తొలగింపు మిలియన్ డాలర్ల ప్రశ్న?
<p>దిశ, స్టేషన్‌ఘన్‌పూర్: గడీల పాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గం నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, డాక్టర్ రాజయ్యలను ఎందుకు తొలగించారనేది నేటికీ మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిందని బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల కన్వీనర్, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి అన్నారు. మంగళవారం నియోజకవర్గ కేంద్రంలో రాష్ట్ర నాయకుడు మాదాసు వెంకటేశ్ అధ్యక్షతన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో ప్రాణ త్యాగాలు చేసి పార్టీలకతీతంగా సాధించుకున్న […]</p>

దిశ, స్టేషన్‌ఘన్‌పూర్: గడీల పాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గం నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, డాక్టర్ రాజయ్యలను ఎందుకు తొలగించారనేది నేటికీ మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిందని బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల కన్వీనర్, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి అన్నారు. మంగళవారం నియోజకవర్గ కేంద్రంలో రాష్ట్ర నాయకుడు మాదాసు వెంకటేశ్ అధ్యక్షతన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో ప్రాణ త్యాగాలు చేసి పార్టీలకతీతంగా సాధించుకున్న తెలంగాణలో ఇచ్చిన హామీలను విస్మరించి ఉద్యమాల ఖిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాపై కేసీఆర్ ప్రయోగాలు చేస్తున్నాడని ధ్వజమెత్తారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్న హామీతో సహా, ఆ వర్గాలకు ఇచ్చిన్న మరెన్నో హామీల సంగతేంటని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్సీగా పూర్తి కాలం పని చేసిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి కనీసం నిరుద్యోగుల సమస్యలను లేవనెత్తడం చేతకాలేదని విమర్శించారు. అందుకు టీఆర్ఎస్‌కు దీటుగా ముందుకు వెళుతున్న బీజేపీని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.






