- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిగ్ బ్రేకింగ్ :టీఆర్ఎస్‌లోకి పెద్దిరెడ్డి.. ముహూర్తం ఫిక్స్
<p>దిశ ప్రతినిధి, కరీంనగర్ : తెలంగాణలో బీజేపీ పార్టీకి మరో షాక్ తగలనుంది. బీజేపీ కోర్ కమిటీ సభ్యునిగా ఉన్న మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి ఈనెల 30న టీఆర్ఎస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలె ఆయన బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరడం వల్లే ఆ పార్టీకి చెందిన ముఖ్యమైన నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నట్లు సమాచారం. […]</p>

దిశ ప్రతినిధి, కరీంనగర్ : తెలంగాణలో బీజేపీ పార్టీకి మరో షాక్ తగలనుంది. బీజేపీ కోర్ కమిటీ సభ్యునిగా ఉన్న మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి ఈనెల 30న టీఆర్ఎస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలె ఆయన బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరడం వల్లే ఆ పార్టీకి చెందిన ముఖ్యమైన నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నట్లు సమాచారం. హుజురాబాద్ ఉపఎన్నికల నేపథ్యంలోనే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమైన నాయకుడు కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే.
రానున్న ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్‌ను ఎలాగైన ఓడించే ఉద్దేశ్యంతోనే టీఆర్ఎస్ పార్టీ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే బీజేపీకి చెందిన కీలక నేతలకు భారీగా ఆఫర్లు ఇస్తూ ఒక్కొక్కరినీ కమలం పార్టీకి దూరం చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు మంత్రులు కూడా హుజురాబాద్‌లో ఈటల ఓటమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నట్లు సమాచారం. అయితే, ఉపఎన్నికలో పెద్దిరెడ్డికి టీఆర్ఎస్ టిక్కెట్ కేటాయిస్తుందా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.






