పాములకు పాలు, గుడ్లు వేయకండి : అటవీశాఖ

by  |
Nagula Panchami
X

దిశ, తెలంగాణ బ్యూరో: నాగుల పంచమి సందర్భంగా పాములకు పాలు, గుడ్లు పెట్టి సర్పాలను ఇబ్బందులు పెట్టొదని, సర్పాలను కాపాడటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని గురువారం అటవీ శాఖ ప్రకటన విడుదల చేసింది. పంచమి రావడంతో నగరంలోని దేవాలయాల వద్ద పాములు పట్టేవారికి మహిళలు ఎలాంటి డబ్బులు ఇవ్వొద్దని పేర్కొన్నారు. పాములు పాలు తాగవని, వాటికి 10 రోజులుగా ఎలాంటి నీరు, ఆహారం ఇవ్వకుండా హింసించి పంచమి రోజు గుడికి తీసుకొస్తారని, అందుకే పాలు తాగుతాయని తెలిపారు. ఇలాంటి సర్పాలను వేధించే వారిని ఎవరూ ప్రోత్సహించొద్దని పిలుపునిచ్చారు.

వీటిని నివారించేందుకు నేడు నగరంలోని వివిధ ప్రాంతాల్లో అటవీశాఖ నుంచి డీఎఫ్‌వోలు, ఎఫ్ఆరోవోలు, వివిధ అధికారులు, స్నేక్ సొసైటీ సభ్యులు, ఎన్జీవోలతో కలిసి రైడ్స్ చేసి పాములు పట్టే వారిని గుర్తించి కేసులు పెడతామని తెలిపారు. ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారు కనిపిస్తే 18004255364 నంబర్ కు కాల్ చేసి తెలిపాలని అటవీశాఖ అధికారులు సూచించారు.


Next Story

Most Viewed