- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అవేకన్ ఇండియా సంచలన వ్యాఖ్యలు.. వ్యాక్సిన్ వేయించుకోమంటే శిక్షే
<p>దిశ, ఖైరతాబాద్ : వ్యాక్సిన్లు వేసుకోవాలని ఒత్తిడి చేసే అధికారం ఎవరికీ లేదని, ఒత్తిడి చేస్తే చట్ట ప్రకారం శిక్షార్హులని అవేకన్ ఇండియా మూమెంట్ తెలంగాణ చాప్టర్ పేర్కొంది. బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో చాప్టర్ సభ్యులు సరస్వతి, సురేంద్ర, ప్రవీణ్ సక్సేనా, రచన మాట్లాడుతూ..”ఒక వ్యాక్సిన్ తయారు చేసేందుకు కనీసం పదేళ్లు పడుతుందని, అలాంటిది అతి తక్కువ సమయంలో వచ్చిన వ్యాక్సిన్లు పూర్తి సురక్షితమైనవి అని ప్రచారం చేయడం ఎంత మాత్రం సరికాదని స్పష్టం […]</p>

దిశ, ఖైరతాబాద్ : వ్యాక్సిన్లు వేసుకోవాలని ఒత్తిడి చేసే అధికారం ఎవరికీ లేదని, ఒత్తిడి చేస్తే చట్ట ప్రకారం శిక్షార్హులని అవేకన్ ఇండియా మూమెంట్ తెలంగాణ చాప్టర్ పేర్కొంది. బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో చాప్టర్ సభ్యులు సరస్వతి, సురేంద్ర, ప్రవీణ్ సక్సేనా, రచన మాట్లాడుతూ..”ఒక వ్యాక్సిన్ తయారు చేసేందుకు కనీసం పదేళ్లు పడుతుందని, అలాంటిది అతి తక్కువ సమయంలో వచ్చిన వ్యాక్సిన్లు పూర్తి సురక్షితమైనవి అని ప్రచారం చేయడం ఎంత మాత్రం సరికాదని స్పష్టం చేశారు. టీకాలు వేసుకున్న అనంతరం రెండు నుంచి పదేళ్ల లోపు కూడా సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని అన్నారు. వ్యాక్సిన్ వేసుకునే స్వేచ్ఛ పూర్తిగా పౌరులదేనని అన్నారు. అలా కాకుండా ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేసుకోవాలని చేసే అధికారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కు లేదని అన్నారు.
ఎక్కడా లేని విధంగా 100% వ్యాక్సిన్ పూర్తయిందని స్టిక్కర్లు అంటించడం ఏమిటని ప్రశ్నించారు. దేశంలో ఎవరి లబ్ధి కోసం వ్యాక్సిన్లు ఇస్తున్నారో అర్థం కానీ పరిస్థితి నెలకొందని, కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని ఉపయోగించి కేవలం క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్న వ్యాక్సిన్లను ప్రజలపై రుద్దుతున్నారు అని మండిపడ్డారు. యాక్షన్ లో ముసుగులో చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే వారిపై ఫిర్యాదు చేసే అధికారం ప్రతి పౌరుడికి ఉంటుందని తెలిపారు.






