‘ఫుడ్ డెలివరీలపై అధిక జీఎస్టీ తగ్గించాలి’

by  |
‘ఫుడ్ డెలివరీలపై అధిక జీఎస్టీ తగ్గించాలి’
X

దిశ, వెబ్‌డెస్క్: ఫుడ్ డెలివరీలపై వస్తువు, సేవల పన్ను(జీఎస్టీ)ని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని రెస్టారెంట్, ఫుడ్ డెలివరీ రంగంలోని పరిశ్రమలు కోరుతున్నాయి. డైన్-ఇన్ విభాగంలో పన్ను 5 శాతం ఉన్నందున రెస్టారెంట్లకు వెళ్తున్న వినియోగదారులతో పోలిస్తే ఫుడ్ డెలివరీ తీసుకునే వినియోగదారులు 13 శాతం అధికంగా చెల్లిస్తున్నారని పరిశ్రమ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ‘భారత్‌లో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ రంగం చాలా వేగంగా పెరిగింది. ప్రస్తుతం ఈ రంగం విలువ సుమారు రూ. 21.7 వేల కోట్లుగా ఉంది. అయితే, జీఎస్టీ అధికంగా ఉండటం వల్ల సవాళ్లను ఎదుర్కొంటున్నట్టు ఫూజా ఫుడ్స్ వ్యవస్థాపకుడు, ఎండీ డిబ్యేందు బెనర్జీ చెప్పారు. ‘ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సేవలను అందిస్తున్న రెస్టారెంట్ల వారికి 18 శాతం అధిక జీఎస్టీ రేటు ఉండటం వల్ల ఈ రంగం వృద్ధిపై ప్రతికూల ప్రభావం ఉందని, ప్రభుత్వం జీఎస్టీ రేట్లను తగ్గించడం వల్ల సరసమైన ధరలకే ఫుడ్ డెలివరీ అందించే వీలు కలుగుతుందని’ ప్లాటర్ హాస్పిటాలిటీ డైరెక్టర్ శిలాదిత్య చౌదరీ అన్నారు. హోమ్ డెలివరీ అమ్మకాలు కరోనా పూర్వస్థాయికి చేరువలో ఉన్నప్పటికీ అధిక జీఎస్టీ రేటు వల్ల నెమ్మదిగా వృద్ధి కనిపిస్తోందని ఆయన వివరించారు.


Next Story

Most Viewed