నేడు ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల.?

by  |
నేడు ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల.?
X

దిశ, వెబ్‌డెస్క్: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నగారా మోగనుంది. శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించనుంది. దీంతో ఇవాళ ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌‌ను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్‌, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, అసోం రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్‌ విడుదల చేసే అవకాశం ఉంది. కాగా, ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో ఎలక్షన్ కమిషన్ పర్యటించింది. ఎన్నికల నిర్వహణపై అధికారులు, రాజకీయ పార్టీలతో ఈసీ చర్చించింది.

మరోవైపు తెలంగాణలోని నాగార్జున సాగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ స్థానం ఉప ఎన్నికకు షెడ్యూల్‌ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన నోముల నర్సింహయ్య మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక ఏపీలోని తిరుపతి పార్లమెంట్‌ స్థానానికి సైతం షెడ్యూల్‌ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. వైసీపీ తరఫున పోటీ చేసి గెలుపొందిన దుర్గా ప్రసాద్‌ గతేడాది కరోనా బారినపడి మృతి చెందారు. దీంతో లోక్‌సభ స్థానం ఖాళీ అయింది. రాష్ట్రాలకు నిర్వహించే ఎన్నికలతో పాటు ఈ రెండు స్థానాలకు సైతం షెడ్యూల్ జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Next Story