- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రిలయన్స్ షోరూంలో అగ్ని ప్రమాదం
by Vemula.Srinu Prasad |
<p>దిశ ఏపీ బ్యూరో: విజయవాడలోని రిలయన్స్ షోరూంలో అగ్నిప్రమాదం సంభవించింది. బెంజి సర్కిల్ సమీపంలోని రిలయన్స్ షోరూం మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ అంతస్తులో ఫుట్ వేర్ అమ్మకాలు, వస్త్ర్రాల విక్రయం జరుగుతుంటాయి. ఈ ఫ్లోర్‌లోనే కార్పొరేట్ ఆఫీసు కూడా ఉంది. అయితే, అగ్నిప్రమాదం జరగడంతో సగానికి పైగా పాదరక్షలు, బూట్లు మంటల్లో కాలిపోయాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలకు ఉపక్రమించారు. షార్ట్ సర్క్యూట్ […]</p>

X
దిశ ఏపీ బ్యూరో: విజయవాడలోని రిలయన్స్ షోరూంలో అగ్నిప్రమాదం సంభవించింది. బెంజి సర్కిల్ సమీపంలోని రిలయన్స్ షోరూం మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ అంతస్తులో ఫుట్ వేర్ అమ్మకాలు, వస్త్ర్రాల విక్రయం జరుగుతుంటాయి. ఈ ఫ్లోర్‌లోనే కార్పొరేట్ ఆఫీసు కూడా ఉంది. అయితే, అగ్నిప్రమాదం జరగడంతో సగానికి పైగా పాదరక్షలు, బూట్లు మంటల్లో కాలిపోయాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలకు ఉపక్రమించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగివుంటుందని భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Next Story






