చార్మినార్‌లో అగ్నిప్రమాదం

by Batti.Sumithra |

<p>దిశ, చార్మినార్ : షార్ట్ సర్క్యూట్ కారణంగా చెప్పుల దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించిన ఘటన చార్మినార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. చార్మినార్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మచిలి కమాన్ వద్ద గల చెప్పుల దుకాణంలో అకస్మాత్తుగా మంటలు రావడాన్ని గమనించిన స్థానికులు చార్మినార్ పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న చార్మినార్ పోలీసులు చెప్పుల దుకాణం యజమానికి, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ ఇంజన్ అక్కడికి చేరుకునే లోపే చెప్పుల దుకాణం [&hellip;]</p>

చార్మినార్‌లో అగ్నిప్రమాదం
X

దిశ, చార్మినార్ : షార్ట్ సర్క్యూట్ కారణంగా చెప్పుల దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించిన ఘటన చార్మినార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. చార్మినార్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మచిలి కమాన్ వద్ద గల చెప్పుల దుకాణంలో అకస్మాత్తుగా మంటలు రావడాన్ని గమనించిన స్థానికులు చార్మినార్ పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న చార్మినార్ పోలీసులు చెప్పుల దుకాణం యజమానికి, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ ఇంజన్ అక్కడికి చేరుకునే లోపే చెప్పుల దుకాణం తో పాటు పక్కన ఉన్న షాపులోకి కూడా మంటలు విస్తరించాయి. రెండు గంటల పాటు శ్రమించిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సమాచారం అందుకున్న మలక్‌పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బలాలా ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని అరా తీశారు. ఈ ఘటన విషయమై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తగిన న్యాయం చేస్తామన్నారు.

Next Story