‘రెడ్’ రిలీజ్ డేట్ ఫిక్స్?

by  |
‘రెడ్’ రిలీజ్ డేట్ ఫిక్స్?
X

దిశ, వెబ్‌డెస్క్: ‘ఇస్మార్ట్ శంకర్‌’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రామ్ పోతినేని నుంచి అంతే ఎనర్జిటిక్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ‘రెడ్’ సినిమా ఇప్పటికే పూర్తయినా, రిలీజ్ డేట్‌పై ఇంకా అఫిషియల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వలేదు మూవీ యూనిట్. ఎలాగూ సినిమా పూర్తయింది కాబట్టి ఓటీటీని ఆశ్రయిస్తుందేమో అనుకున్నా.. థియాట్రికల్ రిలీజ్‌కు సిద్ధమైపోయిందనేది ఫిల్మ్ నగర్ టాక్. జనవరి 15న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుని సంక్రాంతి బరిలో నిలవబోతుందని సమాచారం. తమిళ్ ఫిల్మ్ ‘తడమ్’ రీమేక్‌గా వస్తున్న చిత్రంలో మాళవికా శర్మ, అమృతా అయ్యర్, నివేదా పేతురాజ్‌ కథానాయికలు కాగా.. స్రవంతి మూవీస్ బ్యానర్‌ నిర్మించిన సినిమాకు తిరుమల కిశోర్ దర్శకులు. మణిశర్మ మ్యూజిక్ డైరెక్షన్‌లో వచ్చిన ఆల్బమ్ ఇప్పటికే సూపర్ హిట్ అయింది.

Next Story

Most Viewed