ఫిలిప్పినో బేబీకి ‘హెచ్‌టీఎమ్‌ఎల్’గా నామకరణం

by  |
Filipino man called Mac names newborn son HTML
X

దిశ, ఫీచర్స్ : అమ్మ కడుపులో పెరుగుతున్న నాటి నుంచే పుట్టబోయే బిడ్డకు ఏం పేరు పెట్టాలా? అని భార్యాభర్తలు తెగ ఆరాటపడుతుంటారు. ఇక భారతీయుల్లో చాలామంది పుట్టిన తేదీ, సమయం, నక్షత్రం, తిథులను బట్టి పేరు పెడితే.. విదేశాల్లో మాత్రం స్థానిక నిబంధనల ప్రకారం ముందే పేరు డిసైడ్ చేస్తారు. అయితే పేరు ఎప్పుడు పెట్టినా గానీ.. నచ్చిన పేరును ఎంపిక చేయడం తల్లిదండ్రులకు ఓ పెద్ద సవాల్. కాగా తమ బిడ్డ పేరు కొత్తగా, ఆకట్టుకునేలా ఉండాలనే ఇంటెన్షన్‌తో ఇంటర్నెట్‌తో పాటు పేర్ల పుస్తకాల్లోనూ తెగ వెతుకుతుంటారు. చివరకు అందరి అభిప్రాయంతో ఓ మంచి పేరును డిసైడ్ చేస్తారు. ఈ సంగతి పక్కనబెడితే.. పాండమిక్ టైమ్‌లో చాలామంది కొవిడ్, శానిటైజర్, కరోనా, లాక్‌డౌన్, క్వారంటైన్ అని పేర్లు పెట్టడం చూశాం. అలాగే ఓ ఫిలిప్పినో ఫ్యామిలీ మొత్తం కూడా చిత్రవిచిత్రమైన పేర్లు పెట్టుకోగా.. రీసెంట్‌గా తమ ఇంట్లో పుట్టిన బుడ్డోడికి ‘హెచ్‌టీఎమ్‌ఎల్’(Hypertext Markup Language Rayo Pascual) అని పేరు పెట్టడం విశేషం. కాగా ప్రస్తుతం ఈ పేరు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

తల్లిదండ్రులు తమ బిడ్డకు పేరు పెట్టే క్రమంలో యూనిక్ నేమ్ కోసం వెతకడం అసాధారణం విషయం కాదు. ఫిలిప్పీన్స్‌కు చెందిన వెబ్ డెవలపర్ మాక్ పాస్కల్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. కంప్యూటర్ లాంగ్వేజ్ మీదున్న అతడి ప్రేమను చాటుకోవడానికి పాస్కల్ తన కుమారునికి ‘‘HTML’గా నామకరణం చేశాడు. ఇక ‘హెచ్‌టీఎమ్‌ఎల్’ అనేది కంప్యూటర్ లాంగ్వేజ్ అని తెలిసిన విషయమే. అయితే పాస్కల్ ఇంట్లో ప్రత్యేకమైన పేర్లు పెట్టడం కొత్తేం కాదు. పాస్కల్ సోదరుడి పేరు ‘మాకరోనీ 85’, అతడి సోదరి పేరు స్పాగెట్టి 88. ఆమె పిల్లల పేర్లు ‘చీజ్ పిమింటో, పర్మేసన్ చీజ్’ కాగా, వారి నిక్ నేమ్స్ ‘చిప్పీ, పీవీ’. ఇక ఆ చిన్నారుల కజిన్స్ పేర్లు ‘డిజైన్, రీసెర్చ్’. ప్రస్తుతం ‘హెచ్‌టీఎమ్‌ఎల్‌’ను ఫేస్‌బుక్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేయడంతో ఆ పోస్ట్ వైరల్ అయింది. అయితే కొంతమంది నెటిజన్లు మాత్రం ఎలన్ మస్క్ తన కుమారునికి పెట్టినట్లు X Æ A-Xii అని పెట్టలేదని చమత్కరించగా, మరికొందరు అతడి పేరు కారణంగా హెచ్‌టీఎమ్‌ఎల్‌ను తన పాఠశాలలో వేధింపులకు గురిచేస్తారని అభిప్రాయపడ్డారు.

‘చాలామంది ప్రజలు ఇతరుల ‘పేరు’ను ఎగతాళి చేయడం సాధారణంగా చూస్తుంటాం. అయితే ఎదుటి వారి పేరు గురించి మీరు చింతించకండి. ఇక మా బాబు గురించి హైపర్‌టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ ప్రీస్కూల్, గ్రేడ్‌స్కూలర్లకు అర్ధం కాదు. ఏదేమైనా అది మేం చూసుకుంటాం. రియాలిటీని అంగీకరించండి, పిల్లలందరికీ సాధారణ పేర్లు ఉండకపోవచ్చు కానీ వారిని గౌరవించమని మీ పిల్లలకు నేర్పండి. నా కుటుంబానికి ఏమి నేర్పించాలో, మా పిల్లలకు ఏం పేరు పెట్టాలో మాకు తెలుసు’ అని పాస్కల్ పేర్కొన్నాడు.


Next Story

Most Viewed