హైదరాబాద్ హడల్.. ఫీవర్ సర్వేలో ఆసక్తికర విషయాలు

by  |
హైదరాబాద్ హడల్.. ఫీవర్ సర్వేలో ఆసక్తికర విషయాలు
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కరోనా కేసుల తీవ్రతను పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫీవర్ సర్వేను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇంటింటికి తిరిగి ఎవరైనా జ్వరం బారిన పడ్డారా లేదా అనే వివరాలను అధికారికంగా ప్రభుత్వం సేకరిస్తోంది. ఈ రిపోర్టుతో రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఏవిధంగా ఉన్నది, దాని కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం ఓ అంచనాకు రానున్నట్లు తెలుస్తోంది. ముందుగా జీహెచ్ఎంసీ పరిధిలో ప్రారంభమైన ఈ సర్వే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. ఇంట్లో ఎవరైన సాధారణ జ్వరం బారిన పడ్డారా.. కరోనా సోకిందా అనే వివరాలను రిపోర్టులో పొందుపరచనున్నారు.

అయితే, ఇప్పటివరకు జీహెచ్ఎంసీ పరిధిలో నమోదైన కరోనా కేసుల వివరాలను గురువారం బల్దియా ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి మే-5వరకు 28 వేల పాజిటివ్ కేసులు రాగా, ఈనెల 1 నుంచి ఇప్పటివరకు 5వేలకు పైగా కేసులు నమోదైనట్లు జీహెచ్ఎంసీ ప్రకటించింది. దీంతో గ్రేటర్ హైదరాబాద్‌పై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఇప్పటివరకు లక్ష ఇళ్లల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది సర్వే నిర్వహించినట్లు బల్దియా వెల్లడించింది.



Next Story

Most Viewed