ఆయిల్ ఫుడ్ తింటున్న వారు.. వీటి గురించి తప్పక తెలుసుకోవాల్సిందే

by Disha Web Desk 10 |
ఆయిల్ ఫుడ్ తింటున్న వారు.. వీటి గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
X

దిశ, ఫీచర్స్: ఎంత వద్దు అనుకున్నా కూడా.. మంచి ఆహారాన్ని తినాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. కానీ, కొన్ని రకాల ఫుడ్స్ ఆరోగ్యానికి అంత మంచివి కావు. అలాంటి సమయంలో ఆయిల్ ఫుడ్ తిన్నా కూడా వెంటనే కొన్ని పనులు చేస్తే మన ఆరోగ్యం చెడిపోకుండా ఉంటుంది. అవేంటో ఇక్కడ చూద్దాం..

ప్రోబయోటిక్స్:మీరు ఎంత కొవ్వు పదార్ధాలు తిన్నా, పెరుగు వంటి ప్రోబయోటిక్ అధికంగా ఉండే ఆహారాలు తినడం వల్ల వాటిలో ఉండే మంచి బ్యాక్టీరియా వాటిని వేగంగా జీర్ణం చేస్తుంది.

వేడి నీరు: మీరు ఉదయాన్నే తాగే గోరువెచ్చని నీరు చాలా రుచిగా ఉంటుంది. కొవ్వు పదార్థాలు తిన్న వెంటనే వేడినీరు తాగడం వల్ల ఎసిడిటీ నివారించవచ్చు.

ఐరన్: ఐరన్ లో ఉండే లక్షణాలు కూడా జీర్ణ సమస్యలను తగ్గిస్తాయి.

ఫైబర్ కలిగిన ఆహారాలు: కొవ్వు ఆహారం తిన్న కొన్ని గంటల తర్వాత పీచుపదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటే, తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది.

గ్రీన్ టీ/అల్లం టీ: ఈ రెండు శరీరంలోని వ్యర్థ పదార్థాలను తొలగించడం ద్వారా శరీరాన్ని డీటాక్స్ చేయడంలో సహాయపడతాయి.

వాము: జీర్ణ సమస్యలకు వాము మంచిగా పనిచేస్తుంది. ఆయిల్ ఫుడ్ తిన్న తర్వాత వాముని మరిగించి.. ఆ నీళ్లు తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది.

Next Story