సంపద పన్ను ద్వారా భారత్ నుంచి బిలియనీర్లు తరలిపోతారు: ఆర్థికవేత్త

by Disha Web Desk 17 |
సంపద పన్ను ద్వారా భారత్ నుంచి బిలియనీర్లు తరలిపోతారు: ఆర్థికవేత్త
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో సంపద పన్ను విధించడం ద్వారా భారత్ ‌నుంచి వ్యాపారవేత్తలు దుబాయ్ వంటి దేశాలకు తరలిపోయే అవకాశం ఉందని రాజకీయ ఆర్థిక వేత్త, రచయిత గౌతమ్ సేన్ హెచ్చరించారు. సంపద పన్ను అనేది రూ.1 కోటి కంటే ఎక్కువ ఆదాయం, కంపెనీ ఆదాయం రూ. 10 కోట్ల కంటే ఎక్కువ ఉన్న వ్యక్తిపై విధిస్తారు. ఈ పన్ను విధానం వలన అంబానీలు, అదానీలు, మహీంద్రాలు, టాటాలు, టాప్ 500 లేదా అంతకంటే తక్కువ మంది ధనవంతులు, బిలియనీర్ వర్గం వారు పన్నులు తక్కువగా ఉండే దేశాలకు వలస వెళ్లడానికి ఆసక్తి చూపిస్తారు. దీని వలన దేశం గణనీయమైన సంపదను కోల్పోతుందని ఆయన అన్నారు.

దుబాయ్‌‌లో ఆదాయపు పన్ను లేకపోవడం వలన ఇప్పటికే 70 శాతం మంది అక్కడికి వెళ్లారు, సంపద పన్ను ప్రవేశ పెట్టినట్లయితే మిగిలిన వారు సైతం UAEలో తమ వ్యాపారాలను తిరిగి నమోదు చేసుకుంటారని గౌతమ్ సేన్ తెలిపారు. ఉదాహరణకు స్వీడన్‌ చరిత్రలో ప్రపంచంలోనే అత్యధిక పన్ను విధించే దేశాలలో ఒకటిగా ఉండగా, చాలామంది ధనవంతులు పన్నుల భారాన్ని భరించలేక ఇతర దేశాలకు తరలిపోవడంతో స్వీడన్ వారసత్వపు పన్నును తీసివేసింది. IKEA యజమాని కూడా స్వీడన్ నుండి వలస వచ్చారని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.

సంపద పన్ను విధించడం ద్వారా భారత్‌కు తీవ్ర నష్టమని ఆర్థికవేత్త హెచ్చరిస్తున్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, భారత ఆర్థిక వ్యవస్థ చాలా బాగా పని చేస్తోంది. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ. మనం 8 శాతానికి చేరుకోగలిగితే, సాధ్యమేనని నేను భావిస్తున్నాను, ఆర్థిక వ్యవస్థ పరిమాణం 14 సంవత్సరాలలో మూడు రెట్లు పెరుగుతుంది. ఇది $7 ట్రిలియన్లకు చేరుకునే అవకాశం ఉందని భావిస్తున్నట్లు ఆర్థికవేత్త, రచయిత గౌతమ్ సేన్ అన్నారు.

Next Story

Most Viewed