రియల్ హీరోస్ చేతుల మీదుగా FCUK ఆడియో లాంచ్

by  |
రియల్ హీరోస్ చేతుల మీదుగా FCUK ఆడియో లాంచ్
X

దిశ, వెబ్‌డెస్క్: జగపతి బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎఫ్‌సీయూకే(FCUK) (ఫాద‌ర్-చిట్టి-ఉమా-కార్తీక్‌)’. రాము కార్తీక్, అమ్ము అభిరామి జంటగా రూపొందుతున్న చిత్రాన్ని వచ్చే నెల 12న విడుదల చేయబోతోంది మూవీ యూనిట్. ఈ క్రమంలో మూవీ ఆడియోను లాక్ డౌన్ హీరోస్ ఫ్రంట్ లైన్ వారియర్స్ చేతుల మీదుగా రిలీజ్ చేయించాలని డిసైడ్ అయ్యారు మేకర్స్.

మెడికల్, పోలీస్, మున్సిపల్, మీడియా విభాగాలకు సంబంధించిన రియల్ హీరోస్ తో ఒక్కో వారం ఒక్కో పాటను రిలీజ్ చేయించనున్నట్లు ప్రకటించారు. కాగా, ఇంతకు ముందు జరిగిన ఈ రొమాంటిక్ కామెడీ మూవీ టీజర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న జగపతిబాబు..తను పని చేసిన అత్యంత విలక్షణమైన సినిమాల్లో ఇది ఒకటని చెప్పారు. మూవీ తప్పకుండా సక్సెస్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.


Next Story

Most Viewed