Guinness World Record: బస్సులో బట్టల షాప్‌.. వరించిన గిన్నిస్ రికార్డ్

by  |
Fashion retailer
X

దిశ, ఫీచర్స్ : పాండమిక్ రోజుల్లో అనే కాదు, సాధారణంగానే జనాలంతా ఆన్‌లైన్ షాపింగ్‌కు అలవాటుపడ్డారు. ఒక్క క్లిక్‌తో గుమ్మం ముందరకే అన్ని వస్తువులు చేరుతున్న కాలంలో ఆఫ్‌లైన్ స్టోర్స్ యజమానులు కూడా వినూత్నంగా ఆలోచించడం మొదలుపెట్టారు. ఈ మేరకు కొందరు ఆన్‌లైన్‌ను తలదన్నే ఆఫర్స్‌తో అదరగొడుతుంటే, ఇంకొందరు షాపింగ్‌ స్టోర్‌నే ఇంటి వద్దకు తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఫ్యాషన్ రిటైలర్.. దుబాయ్ వాసులకు డోర్ స్టెప్ షాపింగ్ అనుభవాన్ని అందించేందుకు అతిపెద్ద మొబైల్ బట్టల దుకాణాన్ని తీసుకురాగా.. ఈ షాప్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ టైటిల్ గెలుచుకోవడం విశేషం.

దుబాయ్‌కు చెందిన ‘బ్రాండ్ తెలాల్’ జెంట్స్ ఫ్యాషన్ స్టోర్ నిర్వాహకులు ‘ఫ్యాషన్ ప్రోబ్’ ప్రాజెక్ట్‌‌ పేరుతో అనేక బస్సులను తమ స్టోర్స్‌కు ప్రతిరూపాలుగా మార్చేశారు. ఈ మేరకు ఆన్-డిమాండ్ మొబైల్ బొటిక్‌‌తో కస్టమర్లు ఇంటివద్దనే తమకు నచ్చిన ఫ్యాషన్ వేర్స్ కొనుక్కునే అవకాశాన్ని కల్పించారు. ఈ బ్రాండ్.. మిడిల్ ఈస్ట్‌లో 32 అవుట్లెట్లను కలిగి ఉండగా, ఇటలీలో సొంత ఫుట్‌వేర్ ఫ్యాక్టరీని కలిగి ఉంది. తాజాగా వీరు రూపొందించిన బస్ ఔట్‌లెట్, అతిపెద్ద మొబైల్ క్లాత్ స్టోర్‌గా గిన్నిస్ రికార్డు సాధించింది. అంతేకాదు ఈ ఇనిషియేటివ్, వారి అమ్మకాలను 50 శాతానికి పైగా పెంచడంతో పాటు అత్యంత విజయవంతమైన ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలిచింది.

‘లాక్‌డౌన్ ఆంక్షలు, అనవసరమైన వస్తువుల కోసం ప్రజలు బయటికి వెళ్ళేందుకు ఇష్టపడకపోవడం వల్ల దాదాపు 30 శాతం వినియోగదారులు తగ్గిపోవడాన్ని గమనించాం. మా వ్యాపారం వృద్ధి చెందడానికి, పరిస్థితికి తగ్గట్లుగా మొబైల్ షాపింగ్ ఔట్‌లె‌ట్ ప్రారంభించాం. కస్టమర్ల అవసరాలకు ఈ వేదిక తప్పకుండా ఉపయోగపడుతుంది. గిన్నిస్ వరల్డ్ రికార్డును గెలుచుకున్న మొట్టమొదటి ట్రెడిషనల్ కంపెనీ కూడా మాదే. ఇన్నోవేషన్ మా కంపెనీకి పునాది. మా కస్టమర్ల సౌలభ్యానికి మేము విలువిస్తాం. ఈ విపత్కర సమయంలో మా కస్టమర్లు వారి ఇంటి వద్ద సురక్షితమైన షాపింగ్ అనుభవాన్ని కోరుకుంటున్నప్పుడు మేము వారికి ఈ అవకాశం అందించాం. వారికి సదా కృతజ్ఞతలు
– హసన్ తురాబి, ఔట్‌లెట్ డైరెక్టర్

Next Story

Most Viewed