మండిపోతున్న ఎండలు.. తరగతి గదినే స్విమ్మింగ్ పూల్ చేసేసిన టీచర్స్.. నెట్టిల్లు ఫిదా..

by Dishafeatures3 |
మండిపోతున్న ఎండలు.. తరగతి గదినే స్విమ్మింగ్ పూల్ చేసేసిన టీచర్స్.. నెట్టిల్లు ఫిదా..
X

దిశ, ఫీచర్స్ : ఎండలు మండిపోతున్నాయి. టెంపరేచర్ 42 డిగ్రీలు దాటేసింది. బయటకు అడుగు పెట్టాలంటే భయమేసే పరిస్థితి వచ్చేసింది. ఇక చిన్న పిల్లల సిచుయేషన్ సరేసరి. వేడికి తట్టుకోలేక ఏడుస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్ కు చెందిన టీచర్స్ చేసిన పని నెట్టింట ప్రశంసలు అందుకుంటోంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

అసలు విషయం ఏంటంటే.. కన్నౌజ్ జిల్లా మహసౌనపూర్ ఉమర్ద స్కూల్ కు చెందిన పిల్లలు సెలవులు ఇవ్వక ముందు ఎండల్లోనే బడికి వెళ్లారు. కానీ ఆ వేడి తీవ్రతను తట్టుకోలేక విలవిలలాడిపోతూ కనిపించారు. క్లాస్ రూంను స్విమ్మింగ్ పూల్ గా మారిస్తే బాగుంటుందని వాళ్ల టీచర్ తో చెప్పారు. ఈ విషయాన్ని గురువులందరికీ షేర్ చేసిన ఆ టీచర్.. అందరితో కలిసి ఓ నిర్ణయాన్ని తీసుకుంది. తరగతి గదిలోని టేబుల్స్, చెయిర్స్ తీసేసి ఆర్టిషియల్ స్విమ్మింగ్ పూల్ గా మార్చేశారు ఉపాధ్యాయులు. దీంతో పిల్లలు అంతా కేరింతలు కొడుతూ అందులో ఆడుకుంటూ కనిపించారు. ఇక ఈ వీడియో నెట్టింట వైరల్ కాగా ప్రశంసల జల్లు కురుస్తుంది. ఇలాంటి గురువులు అందరికీ ఉంటే బాగుండేదని చెప్తున్నారు.






Next Story

Most Viewed