- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
by Batti.Sumithra |
<p>దిశ, మెదక్ : అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండల పరిధిలోని వెల్మకన్న గ్రామంలో జరిగింది. కౌడిపల్లి ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం..ఘట్టంబోడ్లు రాములు(52) తనకున్న వ్యవసాయ 33 గుంటల భూమిలో రెండు బోర్లు వేసి వరి సాగు చేశాడు. బోర్లలో నీరులేక వరి పూర్తిగా ఎండిపోయింది. దాదాపు రెండు లక్షల వరకు అప్పులు ఉండటంతో వారం రోజులుగా తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. దీంతో తన పొలంలో […]</p>

X
దిశ, మెదక్ :
అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండల పరిధిలోని వెల్మకన్న గ్రామంలో జరిగింది. కౌడిపల్లి ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం..ఘట్టంబోడ్లు రాములు(52) తనకున్న వ్యవసాయ 33 గుంటల భూమిలో రెండు బోర్లు వేసి వరి సాగు చేశాడు. బోర్లలో నీరులేక వరి పూర్తిగా ఎండిపోయింది. దాదాపు రెండు లక్షల వరకు అప్పులు ఉండటంతో వారం రోజులుగా తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. దీంతో తన పొలంలో చెట్టుకు ఉరేసుకున్నాడు. రైతు భార్య వెంకటలక్ష్మి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
Tags: Medak, Kowdipally, farmer, suicide
Next Story






