అకాల వర్షంతో భారీ నష్టం…

8

దిశ-నల్లగొండ: అకాల వర్షానికి నల్లగొండ ముషంపల్లి గ్రామానికి చెందిన కారింగు యాదయ్య అనే రైతు తీవ్రంగా నష్టపోయారు. తనకు ఉన్న ఎకరం భూమిలో ఆయన కోళ్ళ షెడ్డు నిర్మాణం చేపట్టి అందులో దాదాపు నాలుగు వేల బాయిలర్ కోడి పిల్లలను తన సొంత ఖర్చులతో వేసుకున్నాడు. అకాల వర్షం కారణంగా, భారీ వరద రావడంతో ఆ కోళ్ల షెడ్డులో ఉన్న కోడి పిల్లలు చనిపోయాయి. దాదాపుగా ఎనిమిది లక్షలు నష్టం జరిగినట్లు అంచనా వేశారు. కాగా తనను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు వేడుకుంటున్నాడు.