- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బావిలో పడ్డ రైతు.. కారణం ఇదే
by Batti.Sumithra |
<p>దిశ, కోదాడ: నల్లగొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కరెంట్ షాక్ తగలడంతో రైతు బావిలో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. కోదాడ మండలం కూచిపూడిలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు శెట్టి రాముడు (42) గురువారం ఉదయం నారుమడికి నీళ్లు పెట్టడానికి తన వ్యవసాయ పొలానికి వెళ్లి మోటార్ వేసే క్రమంలో విద్యుత్ షాక్ గురై పక్కన ఉన్న బావిలో పడి మృతి చెందారు. సాయంత్రం 7 గంటల వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ […]</p>

X
దిశ, కోదాడ: నల్లగొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కరెంట్ షాక్ తగలడంతో రైతు బావిలో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. కోదాడ మండలం కూచిపూడిలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు శెట్టి రాముడు (42) గురువారం ఉదయం నారుమడికి నీళ్లు పెట్టడానికి తన వ్యవసాయ పొలానికి వెళ్లి మోటార్ వేసే క్రమంలో విద్యుత్ షాక్ గురై పక్కన ఉన్న బావిలో పడి మృతి చెందారు. సాయంత్రం 7 గంటల వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గ్రామస్తులతో కలిసి వెతకడం ప్రారంభించారు. బావిలో చెప్పులు కనపడటంతో గాలించారు. రాత్రి 11 గంటల సమయంలో రాముడి శవం దొరికింది. మృతదేహాన్ని గవర్నమెంట్ హాస్పటల్‌కు తరలించి పోస్ట్‌మార్టం నిర్వహించారు.
Next Story






