- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మార్కెట్ యార్డులో ధాన్యానికి నిప్పు పెట్టి రైతు ఆత్మహత్యాయత్నం
<p>దిశ, వెబ్‌డెస్క్ : జనగామలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వ్యవసాయ మార్కెట్‌లో ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాల ప్రకారం.. జిల్లాలోని చీటాకోడూర్ గ్రామానికి చెందిన కొండల్ రెడ్డి అనే రైతు.. తాను పండించిన ధాన్యానికి నిప్పు పెట్టి నిరసన తెలిపారు. అనంతరం ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 15 రోజులుగా ధాన్యాన్ని లిప్టింగ్ చేయకపోవడంతో మనస్థాపం చెంది తాను ఆత్మహత్యయత్నం చేసినట్టు కొండల్ రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వ అధికారుల తీరుకు […]</p>

దిశ, వెబ్‌డెస్క్ : జనగామలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వ్యవసాయ మార్కెట్‌లో ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాల ప్రకారం.. జిల్లాలోని చీటాకోడూర్ గ్రామానికి చెందిన కొండల్ రెడ్డి అనే రైతు.. తాను పండించిన ధాన్యానికి నిప్పు పెట్టి నిరసన తెలిపారు. అనంతరం ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 15 రోజులుగా ధాన్యాన్ని లిప్టింగ్ చేయకపోవడంతో మనస్థాపం చెంది తాను ఆత్మహత్యయత్నం చేసినట్టు కొండల్ రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వ అధికారుల తీరుకు వ్యతిరేకంగా తాను ఈ పని చేసినట్టు ఆయన తెలిపారు.ఈ సమాచారం తెలుసుకున్న మార్కెట్ సిబ్బంది వెంటనే స్పందించి ఆత్మహత్యాయత్నం చేసిన రైతును అడ్డుకుని ధాన్యం లిఫ్టింగ్ చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఘటనపై మార్కెట్ కార్యదర్శి వివరణ కొరగా.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోలు జరుగుతుందని తెలిపారు.






