చిరు గ్రేటా.. పవన్ గ్రేటా.. శాంతి టాకీస్‌లో ఫ్యాన్స్ పిడిగుద్దులు!

by  |
చిరు గ్రేటా.. పవన్ గ్రేటా.. శాంతి టాకీస్‌లో ఫ్యాన్స్ పిడిగుద్దులు!
X

దిశ, కామారెడ్డి : వకీల్ సాబ్ సినిమా గతంలో ఎన్నడూ లేని హంగామా సృష్టిస్తోంది. మెగా అభిమానులకు పండుగ తెచ్చిన వకీల్ సాబ్, నానా రభసకు కేంద్ర బిందవుగా మారుతోంది. షో లేట్ అయిందని, మూవీ మధ్యలో ఆగిపోయిందని థియేటర్లలో ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. థియేటర్ల రూపురేఖలు మార్చేస్తున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శాంతి థియేటర్లో శుక్రవారం రాత్రి సెకండ్ షో సమయంలో మెగా ఫ్యాన్స్ మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. పట్టణానికి చెందిన సుమారు 50 మంది యువకులు ఒకరిపై ఒకరు పరస్పరం దాడులు చేసుకున్నారు.

పిడిగిద్దుల వర్షం కురిపించుకున్నారు. అలాగే మద్యం మత్తులో సినిమా ప్రొజెక్టర్ పై వాటర్ బాటిళ్లను విసిరారు. థియేటర్‌లోని సీట్లను చింపివేసారు. అరగంట పాటు యువకుల గొడవతో వకీల్ సాబ్ సినిమాను యాజమాన్యం నిలిపి వేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. వారిని సముదాయించారు. దాంతో వివాదం సద్దుమణిగింది. అయితే, చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య గొడవ జరిగినట్లు పట్టణంలో జోరుగా ప్రచారం సాగుతోంది.


Next Story

Most Viewed