కొడుకుతో షారుఖ్‌ను అలా చూసి ఎమోషనల్ అయిపోయిన ఫ్యాన్స్.. వీడియో వైరల్

by  |
Sharro11
X

దిశ, సినిమా: బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ డ్రగ్స్ కేసులో పట్టుబడినప్పటి నుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉన్నారు. ఆర్యన్ బెయిల్ కోసం ఎదురుచూస్తున్న షారుఖ్ అభిమానులు.. రోజుకో వీడియో షేర్ చేస్తూ తమ అభిమానాన్ని తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా షారుఖ్ తన కూతురు సుహానా, కొడుకు ఆర్యన్‌తో కలిసి ఆడుకున్న బ్యూటిఫుల్ వీడియోను నెట్టింట వైరల్ చేశారు. జిమ్‌లో పిల్లలతో చేసిన అల్లరి, షూటింగ్‌ స్పాట్, క్రికెట్ స్టేడియంలో గడిపిన మూమెంట్స్‌తో కూడిన ఈ వీడియో అభిమానులను ఎమోషనల్ చేస్తుండగా.. ‘వి లవ్ యూ SRK’ అంటూ తమ మద్దతు తెలుపుతున్నారు.

ఇక షారుఖ్‌కు తన పిల్లలంటే ఎంత ఇష్టమో కొత్తగా చెప్పక్కర్లేదు. తానొక సూపర్ స్టార్ కావొచ్చు కానీ… తన పిల్లలతో ఉన్నప్పుడు తండ్రిని మాత్రమేనని, వారిద్దరు తనకు బెస్ట్ ఫ్రెండ్స్ అని చాలాసార్లు చెప్పాడు. కాగా ప్రస్తుతం షారుఖ్ ‘పఠాన్’ మూవీ చేస్తుండగా.. ఆర్యన్ కేసుతో వాయిదా పడింది.

https://twitter.com/Fan__SRK/status/1448282167830843395?s=20

Next Story

Most Viewed