కార్ల అమ్మకాల్లో దశాబ్దంలోనే అత్యంత చెత్త పండుగ సీజన్!

by  |
FADA expects
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయంగా దీపావళికి జరిగిన అమ్మకాలు గత దశాబ్దంలోనే అత్యంత చెత్త సీజన్ అని భారత వాహన డీలర్ల సమాఖ్య(ఫాడా) అభిప్రాయపడింది. వచ్చే నెలలో క్రిస్మస్ పండుగ సమయంలోనూ ఇదే ధోరణి ఉండొచ్చని ఫాడా అంచనా వేస్దింది. అయితే, క్రిస్మస్ సమయానికి అనేక కంపెనీలు తమ మోడళ్లలో మార్పులు చేసి మార్కెట్లోకి తీసుకురానున్నాయి. సాధారణంగా ఈ సమయంలో వాహన అమ్మకాలు గణనీయంగా జరుగుతాయి. కానీ, ఇప్పటికే కార్ల తయారీ కంపెనీల వద్ద ఉన్న స్టాక్, పరిస్థితులను బట్టి క్రిస్మస్, న్యూ ఇయర్ సమయంలో ఇప్పుడున్న అమ్మకాల స్థాయినే ఊహించవచ్చని’ ఎఫ్ఏడీఏ అధ్యక్షుడు వింకేష్ గులాటీ అన్నారు.

ఎఫ్ఏడీఏ దేశవ్యాప్తంగా 26,500 ఔట్‌లెట్లను కలిగిన 15,000 మంది ఆటో డీలర్లకు ప్రాతినిధ్యం వహిస్తోంది. ప్రధానంగా చిప్‌ల కొరత వల్ల ఎస్‌యూవీ, కాంపాక్ట్ ఎస్‌యూవీ, లగ్జరీ విభాగాలకు సరఫరా తీవ్ర ప్రతికూలంగా మారింది. ఉత్పత్తిని తగ్గించడంతో వినియోగదారులు కొనుగోలు చేసిన వాహనాల డెలివరీ కోసం వెయిటింగ్ ప్రీరియడ్ ఎక్కువగా ఉంది. దీనివల్ల కొత్తగా కొనేవారు ముందుకు రావడంలేదని వింకేష్ గులాటీ అన్నారు.


Next Story