ఇంటర్ ఫెయిలైన వారికి వచ్చే ఏడాది ఏప్రిల్​లో పరీక్షలు

by  |
ఇంటర్ ఫెయిలైన వారికి వచ్చే ఏడాది ఏప్రిల్​లో పరీక్షలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇంటర్ ఫస్టియర్​ పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరుగలేదని బోర్డు కార్యదర్శి ఒమర్ జలీల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముందుగా చెప్పినట్టుగానే 70 శాతం సెలబస్ తోనే పరీక్షలు నిర్వహించామని ఆయన వెల్లడించారు. విద్యార్థులకు వారి ఫలితాలపై అనుమానాలుంటే రీ వెరిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. బోర్డు నిబంధనల ప్రకారం రీ వెరిఫికేషన్ కు రుసుము చెల్లించాల్సిందేనన్నారు. దీనికి ఈ నెల 22 వరకు గడువు ఉందని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఫెయిలైన విద్యార్థులకు 2022 ఏప్రిల్ లో పరీక్షలు నిర్వహిస్తామని బోర్డు కార్యదర్శి స్పష్టం చేశారు. విద్యార్థులు మానసిక ఒత్తిడి నుంచి బయటపడేందుకు సైకాలజిస్టులను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

Next Story