కొత్త చిక్కులు.. హుజురాబాద్​లో ‘టీకా’ సవాల్

by  |
huzurabad by poll
X

దిశ, తెలంగాణ బ్యూరో: హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక నేపథ్యంలో ఎలక్షన్ డ్యూటీలో పాల్గొనే ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ 2 డోసులు తీసుకోవాల్సిందేనని ఈసీ(ఎలక్షన్​ కమీషన్​) పెట్టిన నిబంధన ఇప్పుడు వైద్యాధికారులకు కొత్త చిక్కులను తెచ్చింది. కరోనా వ్యాప్తి దృష్ట్యా పోలింగ్ సిబ్బందితో పాటు, పోటి చేసే అభ్యర్ధులు, పార్టీల తరపున పనిచేసే కౌంటింగ్​ ఏజెంట్లు కచ్చితంగా పోలింగ్​ తేదీ గడువులోగా రెండు డోసుల టీకాను పొందాల్సిందేనని ఈసీ చేసిన ప్రకటనతో వైద్యాధికారులు కాస్త టెన్షన్​ కు గురవుతున్నారు. అంతేగాక ఆ నియోజకవర్గంలోని మెజార్టీ ప్రజలూ రెండు డోసులు వేసుకోవాలన్నది ఈసీ సూత్రపాయ నిర్ణయం. దీంతో ఆ నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరిగిన వ్యాక్సినేషన్​ శాతాన్ని చూసి అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఈ

నెల 2వ తేదీ వరకు ఆ అసెంబ్లీ సెగ్మెంట్​లో రెండు డోసులు పొందిన వారు కేవలం 28.63 శాతం ఉండగా.. గడిచిన రెండు వారాలుగా చేస్తున్న స్పెషల్​ వ్యాక్సినేషన్​తో అది 35 శాతానికి పెరిగిందని క్షేత్రస్థాయి మెడికల్​ ఆఫీసర్లు చెబుతున్నారు. సింగల్​ డోసు తీసుకున్న వారు మరో 75 శాతం వరకు ఉండొచ్చని వైద్యశాఖ చెబుతున్నది.​ వీలైనంత వేగంగా టీకాలు పంపిణీ చేసేందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా లీడర్లు, పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, ఏజెంట్లు, ఆఫీసర్లకు గడువులోపు టీకాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఆ కేటగిరీకి చెందినోళ్లలో 80 శాతం మంది టీకా పొందినట్లు వైద్యశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. మిగతా వాళ్లందరికీ వేగంగా డోసులు ఇచ్చేందుకు సర్వం సిద్ధం చేస్తున్నామని వైద్యశాఖ పేర్కొంటున్నది.

ఇద్దరు నోడల్​ ఆఫీసర్లు…

కరోనా నియంత్రణ, వ్యాక్సినేషన్​ మానిటరింగ్​ కోసం ఇద్దరు ప్రత్యేక నోడల్​ ఆఫీసర్లను నియమించనున్నారు. హుజూరాబాద్ సెగ్మెంట్​ను డీఎమ్​హెచ్​ఓ మానిటరింగ్​ చేస్తుండగా, ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్న కరీంనగర్​, హన్మకొండ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల బాధ్యతలను డిప్యూటీ డీఎమ్​హెచ్​ఓలకు అప్పగించనున్నారు. వీరి పర్యవేక్షణలో వీలైనంత వేగంగా వ్యాక్సినేషన్​ నిర్వహించనున్నారు. ఈ మేరకు మొబైల్​ వాహనాల ద్వారా ఇంటింటికి తిరిగి టీకా పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఎక్కడికక్కడే డోసులు ఇవ్వనున్నారు. మార్కెట్లు, స్కూళ్లు, పంటపోలాలు, కార్యాలయాలు, పబ్లిక్​ ప్లేసెస్​లలో విస్తృతంగా టీకా కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.

హుజురాబాద్​ వ్యాక్సినేషన్​ స్టేటస్​

మండలం టార్గెట్​ 1డోసు 2డోసు
హుజురాబాద్ 59,220 36,773 11,891
జమ్మికుంట 54,877 37,196 11,002
ఇల్లంతకుంట 23,879 19,568 3,726
వీణావంక 38,923 26,377 7715
మొత్తం 1,76,899 1,19,914 34,334


Next Story

Most Viewed