సామాజిక బాధ్యతగా మొక్కలు నాటాలి

by Chintha Aamani |

<p>దిశ, ఆదిలాబాద్: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నిర్మల్ పట్టణంలోని ఏరియా ఆసుపత్రి ప్రాంగణంలో మంత్రి అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలి అన్నారు. అనంతరం జిల్లా ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బందితో సమావేశమయ్యారు. నిర్మల్ జిల్లాలో ప్రసవాలు 75శాతం జరగడం అభినందనీయమన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ, ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, [&hellip;]</p>

సామాజిక బాధ్యతగా మొక్కలు నాటాలి
X

దిశ, ఆదిలాబాద్: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నిర్మల్ పట్టణంలోని ఏరియా ఆసుపత్రి ప్రాంగణంలో మంత్రి అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలి అన్నారు. అనంతరం జిల్లా ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బందితో సమావేశమయ్యారు. నిర్మల్ జిల్లాలో ప్రసవాలు 75శాతం జరగడం అభినందనీయమన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ, ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, ఆసుపత్రి సూపరింటెండెంట్ దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story