కేసీఆర్ చీకటి అధ్యయనానికి సజీవ సాక్ష్యం ఎన్నికలు: ఈటల రాజేందర్

85

దిశ, జమ్మికుంట: తెలంగాణ రాష్ట్రం కోసం బతికున్నంత కాలం పరితపించిన గొప్ప నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం జమ్మికుంట పట్టణంలోని ఈటల కాంప్లెక్స్‌లో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడారు. 1969లో మంత్రిగా ఉన్న కొండా తన పదవికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడి ప్రజలు చల్లగా జీవించాలని, ఉద్యోగాలు చేయాలని, అంతరాలు తొలగిపోయి, ఆకలి-కేకలు లేని తెలంగాణను కోరిన వ్యక్తిగా అభివర్ణించారు. కానీ ప్రస్తుతం కేసీఆర్ నాయకత్వంలో ఉద్యోగ సమస్యలు పరిష్కారం కాలేదని, సీఎం దృష్టంతా ఎన్నికలపైనే ఉందని.. ప్రజల మీద కాదని విమర్శించారు. దీనికి సజీవ సాక్ష్యం ఎన్నికలు అని, చీకటి అధ్యయనాన్ని పారేయాలని, ఇందుకోసం ప్రజాస్వామిక వాదులు, నిజమైన తెలంగాణ వాదులు, రాజకీయ పార్టీల నాయకులు ఆలోచించాలని సూచించారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..