- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కుటుంబానికి కరోనా వస్తుందనే భయంతో పరారీ..!
<p>దిశ, వెబ్‌డెస్క్: తనకు కరోనా పాజిటివ్ రావడంతో తన కుటుంబసభ్యులకు వస్తుందేమో అని భయంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు ఓ వ్యక్తి. తమ ఇంటి పెద్ద ఎంతకు ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు స్థానిక ఎమ్మెల్యే సహాయంతో ఆయన అడ్రస్ కనుగొన్నారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లోని కోల్‌కతాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కోల్‌కతాలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో తన ద్వారా కుటుంబసభ్యులకు వ్యాప్తి చెందుతుందని ఇంటికి రాలేదు. ఇంటి పెద్ద […]</p>

దిశ, వెబ్‌డెస్క్:
తనకు కరోనా పాజిటివ్ రావడంతో తన కుటుంబసభ్యులకు వస్తుందేమో అని భయంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు ఓ వ్యక్తి. తమ ఇంటి పెద్ద ఎంతకు ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు స్థానిక ఎమ్మెల్యే సహాయంతో ఆయన అడ్రస్ కనుగొన్నారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లోని కోల్‌కతాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. కోల్‌కతాలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో తన ద్వారా కుటుంబసభ్యులకు వ్యాప్తి చెందుతుందని ఇంటికి రాలేదు. ఇంటి పెద్ద ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు బిధన్నగర్ ఎమ్మెల్యే సుజిత్బోస్ను ఆశ్రయించారు. దీంతో ఆయన స్థానిక కౌన్సిలర్‌కు బాధ్యత అప్పగించారు. సదరు కౌన్సిలర్ స్థానిక అధికారులతో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. సదరు వ్యక్తి కోల్‌కతాలోని దత్తాబాద్ ఎదురుగా ఉన్న ఈఎం బైపాస్‌లో మెట్రో స్తంభం కింద ఉన్నట్లు గుర్తించారు. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించారు.






