ఐపీఎల్ సెకెండ్ పార్ట్‌కు ఇంగ్లాండ్ ఆటగాళ్లు గైర్హాజరు

by  |
ఐపీఎల్ సెకెండ్ పార్ట్‌కు ఇంగ్లాండ్ ఆటగాళ్లు గైర్హాజరు
X

దిశ, స్పోర్ట్స్: కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ మిగతా మ్యాచ్‌లను సెప్టెంబర్‌లో నిర్వహించేందుకు బీసీసీఐ కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే ఇంగ్లాండ్ కౌంటీల నుంచే కాకుండా శ్రీలంక, ఆస్ట్రేలియా నుంచి కూడా ఆతిథ్యం ఇస్తామంటూ ఆఫర్లు వచ్చాయి. కాగా, రెండో భాగం ఐపీఎల్‌లో ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్లు ఆడరని ఈసీబీ ఎండీ ఆష్లే గైల్స్ పేర్కొన్నాడు. సెప్టెంబర్‌-అక్టోబర్‌లో లీగ్ జరిగితే ఇంగ్లాండ్ కాంట్రాక్టు ఆటగాళ్లు అంతర్జాతీయ మ్యాచ్‌లో బిజీగా ఉంటారని అందుకే వారు పాల్గొనరని ఈసీబీ చెబుతున్నది. ఆ సమయంలో బంగ్లాదేశ్‌లో పర్యటన, అనంతరం న్యూజీలాండ్‌తో టెస్ట్ సిరీస్ ఉన్నట్లు ఆయన తెలిపారు.

ఐపీఎల్‌తో ఒప్పందం చేసుకున్న జోస్ బట్లర్, బెన్ స్టోక్స్, క్రిస్ వోక్స్, మొయిన్ అలీ, సామ్ కర్రన్చ, టామ్ కర్రన్, ఇయాన్ మోర్గాన్, జానీ బెయిర్‌స్టో, జేసన్ రాయ్ వంటి కీలక ఆటగాళ్లు ఐపీఎల్ సెకెండ్ పార్ట్‌కు దూరమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నది. వీరందరూ ఆయా జట్లలో కీలకమైన ఆటగాళ్లు. దీంతో ఫ్రాంచైజీలు ఆందోళనలో పడ్డాయి. కాగా, ఇంగ్లాండ్‌లోనే ఐపీఎల్ జరిగితే కొంత మంది అంతర్జాతీయ మ్యాచ్‌లకు దూరంగా ఉండి ఐపీఎల్ ఆడే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తున్నది.


Next Story

Most Viewed