ఇంగ్లాండ్‌పై పోరాడి ఓడిన ఇండియా లెజెండ్స్

by  |
ఇంగ్లాండ్‌పై పోరాడి ఓడిన ఇండియా లెజెండ్స్
X

దిశ, స్పోర్ట్స్ : రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో భాగంగా మంగళవారం రాత్రి రాయ్‌పూర్‌లో ఇంగ్లాండ్‌ లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా లెజెండ్స్ 6 పరుగుల తేడాతో ఓడిపోయింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ లెజెండ్స్ మొదట్లో నెమ్మదిగా ఆడినా ఆ తర్వాత చెలరేగిపోయారు. కెప్టెన్ కెవిన్ పీటర్సన్ 37 బంతుల్లోనే 75 పరుగులు చేశాడు. అతడికి డారెన్ మాడీ (29), క్రిస్ స్కోఫీల్డ్ (15), గవిన్ హామిల్టన్ (15) సహకరించడంతోనిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. ఒకానొక దశలో ఇంగ్లాండ్ 200 స్కోర్ దాటుదుందని భావించారు. కానీ మిడిల్, లోయర్ ఆర్డర్‌ను పఠాన్ బ్రదర్స్ తమ బౌలింగ్‌తో కూల్చడంతో ఇంగ్లాండ్ 188కే పరిమితం అయ్యింది.

189 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా లెజెండ్స్ టాప్, మిడిల్ ఆర్డర్ పూర్తిగా విఫలమయ్యారు. సెహ్వాగ్ (6), సచిన్ (9), మహ్మద్ కైఫ్ (1), బద్రినాథ్ (8) ఘోరంగా విఫలమయ్యారు. యువరాజ్ సింగ్ (22) కూడా తక్కువ స్కోర్‌కే వెనుదిరగడంతో ఇండియా లెజెండ్స్ 119 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది. దీంతో ఇండియా లెజెండ్స్‌కు ఘోర ఓటమి తప్పదని అందరూ బావించారు. కానీ ఇర్ఫాన్ పఠాన్ (34 బంతుల్లో 61), మన్‌ప్రీత్ గోని (16 బంతుల్లో 35) మ్యాచ్‌పై ఆశలు రేకెత్తించారు. వీరిద్దరూ కలసి 63 పరుగులు జోడించారు. చివరి ఓవర్‌లో ఇంగ్లాండ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఇండియా లెజెండ్స్ 6 పరుగుల దూరంలో నిలిచిపోయారు. ఇంగ్లాండ్‌కు ఇది రెండో విజయం. కెవిన్ పీటర్సన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

స్కోర్ క్లుప్తంగా..

ఇంగ్లాండ్ లెజెండ్స్

కెవిన్ పీటర్సన్ 75

ఇండియా లెజెండ్స్

ఇర్ఫాన్ పఠాన్ 61, గోనీ 35


Next Story

Most Viewed