ఉద్యోగి కూతురి కోసం ఆ సంస్థ ఏం చేసిందంటే..

by  |
baby
X

దిశ, వెబ్ డెస్క్: సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎస్‌ఇసిఎల్) కంపెనీలో పని చేస్తున్న ఓ ఉద్యోగి కూమార్తె ఆరోగ్యం కోసం ఆ సంస్థ ఆర్థిక సాయం చేసింది. కంపెనీ తన ఉద్యోగికి రూ.16 కోట్లు ఇచ్చిందని సంస్థ జనరల్ మేనేజర్ శశాంక్ శేఖర్ దేవాంగన్ తెలిపారు.

వివరాల్లోకెళ్తే.. ఆ ఉద్యోగి 2 ఏళ్ల కుమార్తె స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఈ వ్యాధికి మందు జోల్జెన్స్మా అనే ఇంజెక్షన్, అది చాలా ఖరీదైనది. ఈ వ్యాధి కారణంగా వెన్నుముకలో ఉండే మోటార్ న్యూరాన్‌లు ప్రభావితం అవుతాయి.అంతేకాకుండా ఇది క్రమంగా కండరాల బలహీనతకు దారితీస్తుంది. ఈ ఔషధాన్ని అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చిందని దేవాంగన్ చెప్పారు.

Next Story