- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM రేవంత్‌కు వెయ్యి కోట్ల దండాలు.. నవీన్ యాదవ్ తల్లి భావోద్వేగం
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(Jubilee Hills By-Election)ల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపుతో ఆ పార్టీ శ్రేణులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(Jubilee Hills By-Election)ల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపుతో ఆ పార్టీ శ్రేణులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో పనిచేసిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సైతం హ్యాపీగా ఉన్నారు. తాజాగా నవీన్ యాదవ్ గెలుపుపై.. ఆయన తల్లి కస్తూరి(Naveen Yadav Mother Kasthuri) స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘నా కొడుకు గెలవడం చాలా ఆనందంగా ఉంది.. సీఎం రేవంత్ రెడ్డికి వెయ్యి కోట్ల దండాలు.. 40 ఏళ్ల కష్టం ఫలించింది.. నా బిడ్డను తొక్కే ప్రయత్నం చేశారు.. కానీ భగవంతుడి దయ వల్ల నా కొడుకు గెలిచాడు’’ అని నవీన్ యాదవ్ తల్లి కస్తూరి చెప్పుకొచ్చారు. కాగా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సమీప బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 24,729 ఓట్లకుపైగా మెజార్టీతో నవీన్ యాదవ్ గెలుపొందారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ చరిత్రలోనే ఇది అత్యధిక మెజార్టీ కావడం గమనార్హం.






