102 మందిపై అత్యాచారం.. శవాలను రేప్ చేస్తూ వీడియో తీసి..

by  |
Rape on Dead Bodies
X

దిశ, వెబ్‌డెస్క్ : కామాంధులు ఎలా పెట్రేగిపోతున్నారో చెప్పడానికి ఈ ఘటన ఓ ఉదాహరణ. ముక్కుపచ్చలారని పసికందు నుంచి కాటికి కాళ్లు చాపిన వృద్ధురాలి వరకు అత్యాచార బాధితులుగానే మిగిలి పోతున్నారు. ఇది చాలదన్నట్లు ఈ నరరూప రాక్షసుడు ఏకంగా శవాల పైనే అత్యాచారాలకు పాల్పడ్డాడు. ఇలా ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 102 మృతదేహాలను రేప్ చేశాడు. ఆ సన్నివేశాలను వీడియో తీసుకొని చూస్తూ పైశాచిక ఆనందం పొందాడు. అంతే కాకుండా రేప్ చేసిన ప్రతి డెడ్ బాడీ కొలతను నమోదు చేసుకునే వాడు. బ్రిటన్‌లో జరిగిన ఈ దారుణ అత్యాచారాల వివరాలను పోలీసులు వెల్లడించారు.

Dead Bodies Rape

ఇంగ్లండ్‌లోని ఈస్ట్ సస్సెక్స్‌లోని హీత్‌ఫీల్డ్ అనే నగరంలో డేవిడ్ ఫుల్లర్ (67) నివసించేవాడు. ఇతను ఒక ఆసుపత్రిలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. మార్చురిలో శవాలను భద్రపరిచే గదిలో ఉండే మెషిన్లను మరమ్మతు చేయడం ఇతడి వృత్తి. అయితే ఈ దుర్మార్గుడు ఆ వంకతో ఎక్కువ సమయం మార్చురీలోనే గడిపేవాడు. ఆ సమయంలో ఈ కామాంధుడు తనలోని రాక్షస బుద్దిని చూపించాడు. డేవిడ్ ఫుల్లర్.. మార్చరీలో ఉన్న శవాలను అతి దారుణంగా రేప్ చేస్తూ అతి క్రూరంగా వ్యవహరించే వాడు. ఈ కామాంధుడు చేతిలో 9 ఏళ్ల చిన్నారి మృతదేహం నుంచి వందేళ్ల వృద్ధురాలి మృతదేహాల వరకు ఉన్నాయి.

Repe

ఇతడు 12 సంవత్సరాల వ్యవధిలో మొత్తం 102 శవాలను రేప్ చేశాడు. అలాగే రేప్ చేసిన ప్రతి ఒక్కరి బరువు, ఎత్తులాంటి వివరాలను నమోదు చేశాడు. ఈ మొత్తం దురాగతాన్ని ఇతడు వీడియోలు తీసి, వాటిని ఫోల్డర్లలో స్టోర్ చేసుకున్నాడు. నెక్రో లార్డ్, డెడ్లీ, బెస్ట్ ఎట్ అనే ఫోల్డర్లను అధికారులు కనిపెట్టారు. అయితే ఇతనిపై పోలీసులకు అనుమానం రావడంతో డిసెంబర్ 2020లో అతని ఇంటిపై అధికారులు రైడ్ చేశారు. దీంతో అధికారులు అతని ఇంట్లో దొరికిన వీడియోలు, హార్డ్ డిస్క్‌లు చూసి ఖంగుతిన్నారు. అంతే కాకుండా 1987లో విండీ నెల్, కారోలిన్ పియర్స్ అనే ఇద్దరు యువతులను అత్యంత కిరాతకంగా కొట్టి, అత్యాచారం చేసి చంపినా కేసులో పోలీసులకు ఇతనిపై అనుమానం రావడంతో డీఎన్ఏ పరీక్ష చేశారు. ఆ నేరం కూడా ఈ కామాంధుడే చేసినట్లు తెలింది.

David Fuller

దీంతో అధికారులు ఇతనిపై మృతదేహాలను అత్యాచారం చేసిన కేసు, ఈ జంట హత్యల కేసు నమోదు చేశారు. ఈ సైకోను కోర్ట్‌లో ప్రవేశ పెట్టగా న్యాయస్థానం యావజ్జీవ కారగార శిక్ష విధించింది. ఇలాంటి మృగం ఈ సొసైటీలో ఉంటే ప్రమాదమని.. అందుకే అతడు చివరి వరకు జైల్లోనే గడపాలంటూ డిసెంబర్ 15న జడ్జి తీర్పు వెలువరించారు. అతడికి పడిన జైలు శిక్ష పట్ల బాధితుల కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

Next Story