మెడికల్ ఎర్రర్‌తో కోమాలోకి హీరోయిన్

by  |
error-koma
X

దిశ, సినిమా : ఈజిప్షియన్ యాక్ట్రెస్ యాస్మిన్ అబ్దుల్ అజీజ్ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా కోమాలోకి వెళ్లిపోయింది. బ్యాక్టీరియన్ ఇన్‌ఫెక్షన్‌ కోసం సర్జరీ చేస్తుండగా మెడికల్ ఎర్రర్‌తో ఈ పరిస్థితికి వచ్చినట్లు మీడియా వెల్లడించింది. ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉన్న తన హెల్త్ కండిషన్ గురించి యాస్మిన్ హజ్బెండ్ అహ్మద్ అల్ అవాడీ, బ్రదర్ వాయెల్ అబ్దుల్ అజీజ్ ఫేస్ బుక్ వేదికగా తెలిపారు.

అయితే తనకు ఎందుకు సర్జరీ చేశారనే విషయాన్ని అధికారులు వెల్లడించలేదని వివరించారు. తను పూర్తి ఆరోగ్యంతో ఇంటికి రావాలని అభిమానులందరూ ప్రార్థన చేయాలని కోరారు. కాగా యాస్మిన్ హెల్త్ కండిషన్‌పై సానుభూతి వ్యక్తం చేసిన ఫ్యాన్స్.. ఇందుకు కారణమైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.



Next Story

Most Viewed