- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డిగ్రీ అర్హతతో బ్యాంకు ఉద్యోగాలు.. దరఖాస్తులు ఎప్పటి నుంచంటే?
బ్యాంకు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు IDBI గుడ్ న్యూస్ చెప్పింది.

దిశ, వెబ్‌డెస్క్: బ్యాంకు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు IDBI గుడ్ న్యూస్ చెప్పింది. IDBI బ్యాంకులో 650 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి మార్చి 1 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అప్లికేషన్లకు మార్చి 12న చివరి తేదీ. అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు డిగ్రీ పాసై, 20-25 ఏళ్ల మధ్య వయస్కులై ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు SC, ST, PWD అభ్యర్థులకు రూ.250, మిగతా వారికి రూ.1050 చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ https://www.idbibank.in/ ను సందర్శించండి.
వివరాలు ఇలా:
*జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఖాళీలు: 650
*అర్హత: అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి.
*చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తుకు అర్హులు.
*కంప్యూటర్ నాలెడ్జ్, ప్రాంతీయ భాష పరిజ్ఞానం ఉండాలి.
*వయోపరిమితి: మార్చి 1, 2025 నాటికి 20 - 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
*జీతం, స్టైపెండ్: శిక్షణ సమయంలో నెలకు రూ.5,000, ఇంటర్న్‌షిప్ సమయంలో నెలకు రూ.15,000 స్టైపెండ్ ఉంటుంది.
*ఉద్యోగంలో చేరిన తర్వాత ఏడాదికి రూ.6.14 లక్షల నుంచి రూ.6.50 వరకు వేతనం ఉంటుంది.
*ఆన్‌లైన్ పరీక్ష తేదీ: ఏప్రిల్ 6, 2025






