India Post GDS 2025 : రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా 21,413 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే?

by Prasanna |
India Post GDS 2025 : రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా 21,413 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం, యువత ఉద్యోగాల కోసం ఎంతగానో ఎదురుచూస్తుంది. వారందరి కోసం ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. భారత ప్రభుత్వ పోస్టల్‌ శాఖ 2025 నోటిఫికేషన్‌ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (ABPM), గ్రామీణ డాక్ సేవక్స్ (GDS) పోస్టుల భర్తీ కోసం ఆహ్వానిస్తోంది. అయితే, మొత్తం 21,413 ఖాళీలు ఉన్నాయి. దీనిలో ఏపీలో 1215 పోస్టులు, తెలంగాణలో 519 పోస్టులున్నాయి. అర్హులైన వారు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు.

1. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM)

పోస్టుల సంఖ్య: అధికారిక వెబ్సైట్లో చూడొచ్చు.

విద్యార్హత: మ్యాథ్స్ , ఇంగ్లీష్ సబ్జెక్టులతో 10వ తరగతి పాస్ ఉండాలి.

వయోపరిమితి: 18 నుండి 40 ఏళ్ళు వారు అర్హులు

2. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM)

పోస్టుల సంఖ్య: అధికారిక వెబ్సైట్లో చూడొచ్చు.

అర్హత : గణితం, ఇంగ్లీష్ సబ్జెక్టులతో 10వ తరగతి పాస్ ఉండాలి.

వయస్సు : 18 నుండి 40 ఏళ్ళు కలిగి ఉండాలి.

3. డాక్ సేవక్

పోస్టుల సంఖ్య: అధికారిక వెబ్సైట్లో చెక్‌ చేసుకోవచ్చు.

అర్హత : గణితం, ఇంగ్లీష్ సబ్జెక్టులతో 10వ తరగతి పాస్ ఉండాలి.

వయస్సు : 18 నుండి 40 ఏళ్ళు ఉండాలి.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు ప్రారంభ తేదీ : ఫిబ్రవరి 10, 2025

దరఖాస్తు చివరితేది: మార్చి 3, 2025

దరఖాస్తు సవరణ తేదీలు : మార్చి 6 నుంచి 8 వరకు.

దరఖాస్తు విధానం:

అర్హులైన అభ్యర్థులు https://indiapostgdsonline.cept.gov.in/ సైట్ నుంచి ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ముందు వన్-టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

అవసరమైన సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయాలి.

మార్చి 6 నుంచి 8 వరకు తప్పులు కరెక్షన్‌ విండో అందుబాటులో ఉంటుంది.

Next Story