- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యువత రాజకీయాల్లోకి రావాలి!
ప్రస్తుత రాజకీయాలలో.. యువత పాత్ర స్పష్టంగా వినిపిస్తూ ఉంది. అసలు ఆ అవసరం ఉందా? అంటే...ఉంది

ప్రస్తుత రాజకీయాలలో.. యువత పాత్ర స్పష్టంగా వినిపిస్తూ ఉంది. అసలు ఆ అవసరం ఉందా? అంటే...ఉంది అనే వారితో పాటు, లేదు అనేవారు లేకపోలేదు.. నాకెందుకులే ఎవరు ఎటుపోతే అనే ధోరణి లేకపోలేదు. కానీ ఇప్పటికీ రాజకీయాల్లోకి రావాలి అనే ఆలోచన యువతలో బలంగానే ఉంది. ఎందుకంటే 2026వ సంవత్సరానికి భారతదేశం మొత్తం 40% యువతతో నిండి ఉంటుంది. ప్రపంచంలో ఏ దేశానికి కూడా ఇంత యువశక్తి లేదు. ఈ యువ మేధాశక్తితో మనం ప్రపంచాన్నే శాసించవచ్చు. ఎన్నో విలువైన ఆవిష్కరణలను సృష్టించవచ్చు. రాజకీయాల్లో కూడా బలమైన ప్రత్యామ్నాయం చూపించవచ్చు. ఇది నాణానికి ఒకవైపు..
మరోవైపు ప్రస్తుతం ఉన్న సామాజిక పరిస్థితులు.. ఆర్థిక పరిపుష్టి దృష్ట్యా కొంతమేర యువత విదేశాల వైపు మొగ్గు చూపుతుంటే, కొంతమంది యువత వ్యసనాలకు బానిస అయ్యి జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు."ఓట్ ఫర్ బెటర్ సొసైటీ", " ఓట్ ఫర్ బెటర్ ఇండియా" ఎంత అవసరమో.. "వోట్ ఫర్ బెటర్ యూత్".." ఓట్ ఫర్ రియల్ డెవలప్మెంట్ "..అనే నానుడిని ప్రజలలోకి తీసుకెళ్లే లాగా కృషి చేద్దాం. అప్పుడే మనం కలలు కన్న నిజమైన యువ భారత్, వికసిత్ భారత్‌ని చూడొచ్చు.
వారసత్వం రాజ్యమేలుతున్న రోజుల్లో..
చాలా సందర్భాల్లో రాజకీయ నాయకులు.. యువత రాజకీయాల్లోకి రావాలని చెప్తారు కానీ అది అమలు పరిచే నాయకులు ఎంత మంది ఉన్నారనేది సందేహమే? 90వ దశకం వరకు చాలా రాజకీయ పార్టీలు ప్రాంతీయ, జాతీయ స్థాయిలో పుట్టుకొచ్చి, దేశంలో పెను మార్పులు తెచ్చాయి. కానీ నేడు రాజకీయాలు అంటే కేవలం వారసత్వ రాజకీయాలు అనే విధంగా కుటుంబ రాజకీయాలను చేస్తున్నారు. ఎక్కడో అడపాదడపా కొంతమంది యువకులు వారి శక్తి సామర్థ్యాల్లో రాజకీయాల్లోకి వచ్చి రాణించినా, అది నామమాత్రమే. ఒకప్పుడు రాజకీయ పార్టీల్లో ప్రతి ముఖ్యమైన వ్యక్తికి ఒక విదురుడు లాంటి వ్యక్తి తరువాతి స్థానంలో ఒకరు ఉండేవారు. ఈ ఇద్దరు వ్యక్తుల్లో ఒక అతను పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం పనిచేస్తే మరొకరు ప్రజలలో నిత్యం ఉంటూ వారి సమస్యలు పరిష్కారం కోసం పోరాడుతూ బలమైన నాయకుడిగా ఎదిగేవారు. ఉదా. వాజపేయి.. అద్వానీ, వైయస్ రాజశేఖర్ రెడ్డి... కేవీపీ రామచంద్రరావు, కానీ నేడు ఆ పరిస్థితి లేదు. తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడా యువకులు కొన్ని పార్టీల ద్వారా, తెరపైకి వస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఇండిపెం డెంట్‌లుగా గెలుస్తున్నారు. అయితే ఒకప్పుడు ఎక్కువ శాతం ఇండిపెండెంట్లు ప్రధాన పార్టీలకు ధీటుగా నిలిచి గెలిచిన సందర్భాలు ఉన్నాయి. కానీ నేడు పంచాయతీ ఎన్నికల్లో కూడా పార్టీల అభ్యర్థులే ప్రధాన భూమిక పోషించి కొత్తవారికి అవకాశం లేకుండా చేస్తున్నారు. ఇలా వారసత్వ రాజకీయాలు రాజ్యమేలుతున్న రోజుల్లో యువ తని రాజకీయాల్లోకి పిలిచే మేధావులు ఏం సమా ధానం చెబుతారు?
రాజకీయాల్లో యువత రాణించాలంటే..
ప్రస్తుతం అంతర్జాతీయ, జాతీయ కార్పొరేట్ సంస్థల సీఈవోలుగా 40 -45 ఏళ్ల వయసు గల వారిని నియమిస్తున్నారు. వీరు ఆయా సంస్థల స్థితిగతులని మార్చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉండటంతో ఎన్నో ఆవిష్కరణలు.. మార్పుని తెస్తాయని యాజమాన్యం నమ్మడం నిజం అయ్యింది. అదే ప్రకారం చట్ట సభల్లో యువతను ప్రోత్సహిస్తే మన దేశం ప్రపంచంలోనే నెం. 1గా నిలవడానికి ఎంతో సమయం పట్టదు. దానికి మనం చేయాల్సింది మూలాలను ఎంచుకొని అంటే గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అన్న బాపూజీ నినాదాన్ని గట్టిగా నమ్మి, గ్రామాల నుండే ఈ వరవడికి శ్రీకారం చుట్టాలి. గ్రామాల్లో ఉన్నత విద్యావంతులైన యువకులకు గ్రామ పెద్దలు, భూస్వాములు కలిసి వారి గ్రామంలో ఒక ఉన్నత విద్యావంతున్ని పంచాయతీ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకొని అతనికి పాలనా పగ్గాలు అందించి సూచనలు అందజేసి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలి. ఆ యువకుడు గ్రామంలో ముఖ్య అవసరాలైన విద్య, తాగునీరు, వైద్యం, ఉపాధి అంశాలపై దృష్టి సారించి గ్రామాన్ని ముందుకు తీసుకెళితే అతి కొద్ది కాలంలోనే ఎన్నో ఆదర్శవంతమైన గ్రామాలు వెలుస్తాయి. సామాజిక మార్పుకోసం పాటు పడే మేధావులు.. రాజకీయ పెద్దలు, పలువురు కార్పోరేట్ సంస్థల అధిపతులు... కష్టపడి పైకి వచ్చిన యువతని, రాజకీయాల్లో రాణిస్తున్న యువతని ప్రోత్సహించి మెంట ర్‌లుగా వ్యవహరించాలి. భవిష్యత్‌లో చట్ట సభలలో యువత ప్రాతినిధ్యం పెరుగుతుంది. ఒక అభ్యర్థి సామర్థ్యాలు వెలికి తీయాలంటే అతనికి అధికారం, అవకాశం ఇచ్చి చూడాలని అమెరికా మాజీ ప్రెసిడెంట్ అబ్రహం లింకన్ చెప్పిన సూత్రాన్ని పాటించాలి.
కె.మురళీమోహన్ కుమార్,
93979 24433
- Tags
- Youth politics






