వలస కార్మికులకు రక్షణ ఏది?

by Ravi |   (  Updated:2025-07-18 00:45:56  IST  )

దేశంలోని మొత్తం కార్మికుల్లో 93 శాతం మంది అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు. దేశ స్థూల జాతీయో త్పత్తిలో 60 శాతం వాటా వీరిదే

వలస కార్మికులకు రక్షణ ఏది?
X

దేశంలోని మొత్తం కార్మికుల్లో 93 శాతం మంది అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు. దేశ స్థూల జాతీయో త్పత్తిలో 60 శాతం వాటా వీరిదే. కానీ కార్మిక చట్టాల పరిధిలో వీరు లేరు. పనిగంటలు, కనీస వేతనాలు, సామాజిక భద్రతా ప్రయోజనాలు అంతకన్నా కనపడవు. ఉద్యోగ భద్రత కూడా మృగ్యమే. అన్ని రంగాల్లో రెగ్యులర్, పర్మినెంట్ కార్మికుల సంఖ్య తగ్గుతున్నది. గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి లేక కుటుంబ పోషణకై పనులు వెతుక్కుంటూ పట్టణ ప్రాంతాలకు వస్తున్నారు. ఇలా వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. అలాగే పక్క రాష్ట్రాలనుండి వచ్చేవారు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నారు. ఇలాంటి వారి రక్షణ కోసం తీసుకొచ్చిన చట్టమే 'వలస కార్మిక చట్టం-1979'. కానీ ఈ చట్టం వలస కార్మికులకు ఎలాంటి రక్షణలు కల్పించలేని పరిస్థితి ఉన్నది.

చట్టం అమలులో తీవ్ర వైఫల్యం

వలస కార్మికుల రక్షణ కోసం ఏర్పాటు చేయబడిన అంతరాష్ట్ర వలస కార్మికుల చట్టం-1979‌ని అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర వైఫల్యం చెందాయి. ఈ చట్టం ప్రకారం వలస కార్మికుల పేర్లు నమోదు చేయాలి. కార్మికులను పంపించే ఏజెన్సీలు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. వారికి కనీస వేతనాలు, రక్షణలు, ఉద్యోగ భద్రత, ప్రమాద బీమా, ఇన్సూరెన్స్, వైద్య, విద్యా సౌకర్యాలు కల్పించే విధంగా ఉండాలి. కానీ ఇవేమీ పాటించడం లేదు. పరిశ్రమల యజమాన్యం, ఎస్టాబ్లి ష్మెంట్స్, షాప్స్, హోటల్స్, రెస్టారెంట్స్, జొమాటో, గిగ్ వర్కర్స్, చిన్న చిన్న పరిశ్రమలు, బిల్లింగ్ కన్స్ట్రక్షన్ రంగం మొదలైన వాటిలో అతి తక్కువ వేతనాలకు ఉపాధి కల్పిస్తూ నైపుణ్యం లేని కార్మికులను నియమించుకొని వారి శ్రమను దోచుకుంటున్నారు.

ఎన్‌సీఆర్‌బీ రిపోర్ట్ ప్రకారం..

ఇటీవల కాలంలో హైదరాబాద్ మహా నగరంగా విస్తరించటం, పరిసర ప్రాంతాల్లో పరిశ్రమలు కూడా రావటంతో ఇక్కడికి వేలాది మంది కార్మికులు యూపీ, బిహార్, చత్తీస్‌ఘడ్, ఒడిస్సా, బెంగాల్, అస్సాం, పంజాబ్ తదితర ప్రాంతాల నుండి వస్తున్నారు. పని ప్రదేశంలో రక్షణ కల్పించాలని చెబుతున్న చట్టాన్ని అమలు చేయకుండా నిర్లక్ష్యం చేయడం ఫలితంగా అనేక ప్రమా దాలు జరిగి కార్మిక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం గత ఐదు ఏళ్లలో 600కు పైగా పారిశ్రామిక ప్రమాదాలు జరిగాయి. అందులో1,116 మరణాలు సంభవించినట్లు సమాచారం. గత పది ఏళ్లలో ఫార్మ్ యూనిట్లలో 102 భారీ అగ్ని ప్రమాదాలు జరగగా.. 100 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు అగ్నిమాపక శాఖ లెక్కలు చెబుతున్నాయి. అందుకే ప్రభుత్వం కంపెనీలు ప్రమాద నివారణకు భద్రతా ప్రమాణాలు పాటించేలా చూడాలి.

కార్మికులకు భద్రత ఉండాలి!

సంస్థలో పనిచేస్తున్న కార్మికులకు మరిన్ని భద్రత చర్యలు చేపట్టాలి. కర్మాగారాల్లో భద్రత వైఫల్యాలు, కార్మిక చట్టాలు ఉల్లంఘనల నివారణకు ప్రత్యేక నిబంధనలు రూపొందించాలి. కర్మాగారాల పర్యవేక్షణ రెగ్యులర్‌గా ఉండాలి. పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలి. కార్మికులు అందరికీ ఇన్సూరెన్స్‌తో పాటు ప్రమాద బీమా చేయించాలి. ప్రమాదాలలో చనిపోయిన ప్రతి కుటుం బానికి కనీసం ఒక కోటి రూపాయలు తగ్గకుండా సాయం అందించాలి. ప్రమాదాల బాధ్యతలకు యాజమాన్యాలు బాధ్యతలు వహించే విధంగా చూడాలి. ప్రాణాలు కోల్పో యిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలి. అలాగే వలస కార్మికుల రక్షణకు సమగ్రమైన చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది.

-ఉజ్జిని రత్నాకర్ రావు

ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు

94909 52646

Next Story