- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సంక్షేమ పథకాలే ఆధారం కాకూడదు..
రైతులు, గిరిజనులు, పేదల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తాత్కాలిక భరోసా ఇవ్వాలి గానీ పూర్తిగా ఆధారపడే పరిస్థితి తీసుకురాకూడదనే అంశంపై విశ్లేషణ.

ప్రభుత్వాలు ప్రస్తుతం రైతులు, పేదలు, గిరిజనులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం అనేక పథ కాలను అమలు చేస్తున్నాయి. ప్రజల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమచేసే విధానంతో తక్షణ ఆర్థిక సహాయం అందిస్తున్నాయి. వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, జీవనోపాధి వంటి రంగాల్లో ఈ పథకాలు ఎంతో ఉపయోగపడు తున్నాయి. ముఖ్యంగా రైతు భరోసా, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి వంటి పథకాలు రైతులకు ఆర్థిక భరోసా కల్పించాయి. అనేక కుటుంబాలు తాత్కాలిక ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు ఇవి తోడ్పడ్డాయి. అయితే కాలక్రమేణా కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఈ పథకాలపై అధికంగా ఆధార పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో రైతులు ప్రతి విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. పథకాల డబ్బులు ఆలస్యంగా వస్తే ఆందోళన, అసంతృప్తి పెరుగుతోంది. వ్యవసాయం, కూలి పనులు వంటి సంప్రదాయ ఉపాధులపై దృష్టి తగ్గి, ప్రభుత్వం ఇచ్చే సాయంపైనే ఆధారపడే పరిస్థితి ఏర్పడుతోంది. గతంలో రైతులు తమ కష్టాన్ని నమ్ముకుని పరస్పర సహకారంతో జీవించేవారు. కష్టపడి సంపాదించిన ఆదాయంతో కుటుంబాన్ని పోషించేవారు. కానీ ఇప్పు డు కొంతమందిలో పని మీద ఆసక్తి తగ్గుతున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిజానికి ప్రభుత్వ పథకాలు ప్రజలకు సహాయం చేయడానికి మాత్రమే. పూర్తిగా ఆధారపడేలా చేయడానికి కావు. ప్రజలు కూడా వాటిని తాత్కాలిక భరోసాగా భావించి, స్వశక్తి, కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని పెంపొందించుకోవాలి. పని మీద నమ్మకం, కష్టం మీద విశ్వాసం ఉంటేనే భవిష్యత్తులో ఆర్థిక కష్టాలను ధైర్యంగా ఎదుర్కోగలం.
-మలిపెద్ది పవన్ కళ్యాణ్
70930 52815






