- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలంటే.. కనీసం ఇంత బడ్జెట్ కేటాయించాల్సిందే!
ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్థి. తరగతి గదిలో బోధన చేస్తున్న ఉపాధ్యాయుడు కాలానుగుణంగా సాంకే తిక పరిజ్ఞానంలో

ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్థి. తరగతి గదిలో బోధన చేస్తున్న ఉపాధ్యాయుడు కాలానుగుణంగా సాంకే తిక పరిజ్ఞానంలో వస్తున్న మార్పులను ఆకళింపు చేసుకొని ఎప్పటి కప్పుడు నవీకరణ చెందవలసిన ఆవశ్యకత ఉన్నది. అందుకే వారికి బోధనలో సరికొత్త మెలకువలను, బోధనకు కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించడంతో పాటు నూతన వ్యూహా లకు పదును పెట్టడానికి గాను తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా సంస్థ(ఎస్సీఈఆర్టీ) నిత్యం ఉపాధ్యాయ లోకాన్ని సన్నద్ధం చేస్తున్నది. అందులో భాగంగానే పాఠశాలలు ప్రారంభం కావడానికి ముందే వేసవికాలంలో వృత్యంతర శిక్షణకు శ్రీకారం చుట్టింది.
కనీస సామర్థ్యాల పెంపు కోసం..
ప్రాథమిక స్థాయి పిల్లలకు గట్టి పునాది వేయాలనే ఆశయంతో NEP-2020 ద్వారా 'నిపుణ్ భారత్' కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా 'ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ' పేరుతో జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి ఆధ్వర్యంలో కనీస సామర్థ్యాల పెంపుతో పాటు అభ్యసన ఫలితాలు రాబట్టడానికి ప్రణాళికలు రూపొందించబడ్డాయి. పలు రాష్ట్రాలు వీటిని అనుసరిస్తూనే ఆయా రాష్ట్రాలకు అనుగుణంగా ప్రత్యేకంగా, అదనంగా మరి కొన్నింటిని జోడించుకుంటున్నాయి. ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీలో గణితం, భాషా పరిజ్ఞానాన్ని పరీక్షించడంతో పాటు ఇప్పుడు పరిసరాల విజ్ఞానాన్ని కూడా మూల్యాంకనం చేయనున్నారు. అంతేకాకుండా దీనికి కృత్రిమ మేధను జోడించి గణితంలో, భాషా పరిజ్ఞానంలో పిల్లల్లో మరింత ఆసక్తిని పెంపొందించే ఉద్దేశ్యంతో సాంకే తిక సాధనాలను రూపకల్పన చేశారు. ఐటీ హబ్‌గా ఆవి ర్భావం చెందుతున్న తెలంగాణ దేశంలోనే ముందు వరు సలో ఉందని, పలువురు నిపుణులు పేర్కొంటున్నారు.
ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా..
యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్(అసర్) అనుసరించి దేశంలో తెలంగాణ రాష్ట్రం విద్యా ప్రగతి నివేదికలో అట్టడుగు స్థాయిలో ఉన్నప్పటికీ.. కరోనా తర్వాత దేశంలోని వివిధ రాష్ట్రాల నివేదికల్ని పరిశీలిస్తే గతంతో పోలిస్తే విద్యా ప్రగతి 6 శాతం వృద్ధి చెందినదని నివేదిక పేర్కొనడం విశ్లే షకుల్ని సైతం ఆశ్చర్యపరిచింది. దీనికి ప్రధాన కారణం ఉపాధ్యాయులకు నిరంతరం అందిస్తున్న శిక్షణే అని తేట తెల్లమైంది. కానీ కేవలం శిక్షణ ద్వారా మాత్రమే విద్యా ప్రగ తిలో అనుకున్న స్థాయిని అందుకోలేమని దానికి ప్రభు త్వం కూడా నిర్మాణాత్మక చేయూత అందించవలసి ఉన్న దని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. కొన్ని పాఠ శాలలు ఉపాధ్యాయ కొరతను ఎదుర్కొంటుండగా మరికొన్ని పాఠశాలలు విద్యార్థులు లేక వెలవెలబోతున్నాయి. మరో పక్క బహుళ తరగతి బోధన, బహుళ స్థాయి బోధన ఒక సవా లుగా నిలుస్తున్నది. దీన్ని అధిగమించడానికి విద్యార్థులు తక్కువ నమోదు ఉన్న పాఠశాలలను సమీప పాఠశాలలో విలీనం చేసి తరగతికి ఒక ఉపాధ్యాయుడు, సబ్జెక్టుకు ఒక ఉపాధ్యాయుడు అనే కోణాన్ని ఆవిష్కరించి ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయా లని విద్యాభిమానులు కోరుకుంటున్నారు.
కనీసం 20 శాతం కేటాయిస్తే..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014-15 బడ్జెట్‌లో 10.89 శాతం నిధులు విద్యకు కేటాయించారు. ఆ తరువాత ప్రతి సంవత్సరం ఆ కేటాయింపు తగ్గించుకుంటూ గత బడ్జెట్ నాటికి 7.6 శాతానికి కుదించబడింది. ఇది చాలా విచారకరం, బడ్జెట్లో విద్యకు కేటాయింపు పెంచడం ద్వారా ప్రతి పాఠశాలలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచవచ్చు. ఆహ్లాదకర, ఆకర్షణీయ వాతావరణాన్ని పాఠశాలలో నిర్మాణం చేయవచ్చు. తద్వారా సమాజాన్ని భాగస్వా మ్యం చేయవచ్చు. ప్రభుత్వ విద్యను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలంటే బడ్జెట్‌లో విద్యకు 30 శాతం నిధులు కేటాయిం చాలని అలా కాకున్నా కనీసం 15 శాతం నుంచి 20 శాతం వరకు కేటాయించాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నా రు.
భాస్కర్ యలకంటి
89194 64488






