- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డిజిటల్ మోసాల వలలో సామాన్యుడు..
సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడంతో చౌకైన ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి వచ్చింది. పేపర్ కరెన్సీ స్థానంలో డిజిటల్ లావాదేవీలు పెరిగాయి. బ్యాంకింగ్ యాప్‌లు, ఫోన్ పే, గూగుల్ పే, పేటీయం వంటి వేదికల ద్వారా లావాదేవీలు జరుగుతున్నాయి..

సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడంతో చౌకైన ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి వచ్చింది. పేపర్ కరెన్సీ స్థానంలో డిజిటల్ లావాదేవీలు పెరిగాయి. బ్యాంకింగ్ యాప్‌లు, ఫోన్ పే, గూగుల్ పే, పేటీయం వంటి వేదికల ద్వారా లావాదేవీలు జరుగుతున్నాయి.. అయితే ఇదే సాంకేతికతను ఆసరాగా చేసుకుని కొందరు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని వర్క్ ఫ్రమ్ హోమ్, పార్ట్‌టైం జాబ్‌లు, ఫిషింగ్, ఫేక్ కస్టమర్ కేర్, ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్, లోన్ యాప్‌లు, జాబ్, వీసా, గిఫ్ట్, లాటరీల పేర్లతో సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఓఎల్‌ఎక్స్, క్విక్కర్, ఇతర మార్కెటింగ్ కంపెనీలు, క్రిప్టో, ఇన్వెస్ట్‌మెంట్, మ్యాట్రిమోనల్ వంటి వేదికల ద్వారా డేటా చౌర్యం, ఆర్థిక మోసాలు జరుగు తున్నాయి. యాప్‌లు డౌన్‌లోడ్ చేసేటప్పుడు తెలియకుండానే వ్యక్తిగత సమాచారం ఇతరుల చేతికి చేరుతోంది. కొద్దిపాటి ఆశకు లోనైతే చాలు.. ఉన్నదంతా పోయి అప్పుల పాలయ్యే పరిస్థితి ఏర్పడుతోంది. ఇటీవల వాట్సాప్‌లో “కంగ్రాట్యూలేషన్స్… మీరు గిఫ్ట్ గెలుచుకున్నారు” అంటూ మెసేజ్‌లు చక్కర్లు కొట్టాయి. ఆ లింక్‌ను క్లిక్ చేస్తే మరో పది గ్రూపులకు పంపాలని రావడం, అలా చేసినవారి వాట్సాప్ హ్యాక్ అయి వారి కాంటాక్ట్స్‌కి ఆటోమేటిక్‌గా మెసేజ్‌లు వెళ్లడం జరిగింది. అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్‌ల పేరుతో అడ్వాన్స్ జీతం చూపించి, రిజిస్ట్రేషన్ ఫీజులు ముందుగా కట్టించుకుని తర్వాత ఉడాయించడం సాధారణమైంది. ఇక తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు వస్తాయంటూ ఇన్వెస్ట్‌మెంట్ మోసాలు, ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్ ద్వారా డబ్బులు కాజేయడం, పిల్లలను గేమ్స్‌కు అలవాటు చేసి అధిక మొత్తాలు వసూలు చేయడం తరచుగా జరుగుతోంది. సర్వేల ప్రకారం వన్ టైం పాస్వర్డ్‌ను ఇతరులతో పంచుకున్నవారు 26 శాతం ఉన్నారంటే పరిస్థితి ఎంత ప్రమాదకరమో అర్థమవుతుంది. ఇక్కడ గమ నించాల్సిన విషయం ఏమిటంటే.. డిజిటల్ నిరక్షరాస్యుడు అంటే చదువులేని వ్యక్తి కాదు. చదువున్నా సాంకేతిక లోసుగులు తెలియని వారందరూ దీనిలోకి వస్తారు.. చదువుకున్న ఉద్యోగులు సైతం మోసపోతున్న ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి.. అందుకే సాంకేతిక విప్లవంతో పాటు దాని దుష్ప లితాలను గుర్తించి, అప్రమత్తంగా ఉండటమే నేటి సమాజానికి అత్యవసరం.
- డా.పోలం సైదులు,
94419 30361






