కేంద్రం బీసీ రిజర్వేషన్ ఆమోదించాలి!

by Ravi |   (  Updated:2025-07-26 00:45:57  IST  )

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో ఆమోదించిన రెండు కీలక బిల్లులు.. స్థానిక సంస్థలలో, విద్య ఉద్యోగాల్లో బీసీలకు

కేంద్రం బీసీ రిజర్వేషన్ ఆమోదించాలి!
X

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో ఆమోదించిన రెండు కీలక బిల్లులు.. స్థానిక సంస్థలలో, విద్య ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించే చట్టాలు. ఇవి రాష్ట్ర రాజకీయ చరిత్రలో మైలురాయి. ఈ బిల్లును కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల హామీ అయిన కామారెడ్డి డిక్లరేషన్‌లో పేర్కొన్నట్టుగానే తీసుకొచ్చింది. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన దానిని అధికారంలోకి వచ్చిన వెంటనే శాసన రూపంలోకి తీసుకువచ్చి తన నిబ ద్ధతను చాటుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. దీనిని బీసీ సంఘాలు హర్షిస్తూ స్వాగతిస్తున్నాయి.

గవర్నర్ ఆమోదం వస్తేనే ఎన్నికలు..

రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణన పైన.. రిజర్వేషన్స్‌ పైన అసెంబ్లీలోనూ, బీసీ సంఘాలతోను, అఖిలపక్ష సమావేశంలోనూ చర్చలు జరుపుతూ 42 శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించింది. రాష్ట్ర అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని కేంద్రం ఆమోదించాల్సి ఉంది. కేంద్రం 42 శాతం బీసీలకు రిజర్వేషన్ అనుకూలంగానే ఉన్నామని ప్రకటిస్తున్నదే తప్ప పార్లమెంటులో బిల్లు ఆమోదం చేసే పరిస్థితిలో లేదు. రాష్ట్రంలో స్థానిక సంస్థలకు సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించడంతో.. సమయం సమీపిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసి గవర్నర్‌కు పంపించింది.. కానీ గవర్నర్ ఆ బిల్లును న్యాయ సహాయం కోసం అటార్ని జనరల్‌కు పంపారు. ఆయన ఆమోదించుటమే తరువాయి ఎన్నికలకు వెళ్లడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది.

కేసీఆర్ తప్పుడు నిర్ణయంతో..

2014లో కేసీఆర్ ప్రభుత్వం చేసిన తప్పుడు నిర్ణయాలతో, న్యాయస్థానాల్లో సరైన వాదనలు సమర్పించకపోవడంతో తెలంగాణ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 18 శాతం, 23 శాతం మధ్య తగ్గించబడ్డాయి. దాంతో వెనుక బడిన వర్గాలు స్థానిక సంస్థలలో వేలాది స్థానాలు కోల్పో యారు. ఇక స్థానిక సంస్థల రిజర్వేషన్ విధానాల్లో 1994లో ఆర్టికల్ 243‌పై సవాల్ చేసిన, 'కృష్ణమూర్తి వర్సెస్ కేంద్ర ప్రభుత్వం' కేసులో 16 సంవత్సరాల తర్వాత 2010లో తీర్పు వచ్చింది. ఆ తీర్పులో బీసీ సామాజిక వర్గానికి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇవ్వాలంటే ఖచ్చితంగా వారి సామాజిక ఆర్థిక గణాంకాలు స్పష్టంగా ఉండాలని చెప్పడం జరిగింది.

తెలంగాణ సర్వే చట్టబద్ధమే!

1994లో తమిళనాడు ప్రభుత్వం, బీసీ వర్గాల ఆందోళనలతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి తమిళనాడు రిజర్వేషన్ చట్టాన్ని రాజ్యాంగం 9వ షెడ్యూల్‌లో చేర్చింది. దీంతో ఆ రిజర్వేషన్లు రాజ్యాంగ సమీక్షకు అవకాశం లేకుండా చేసు కుంది. ఆ విధంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రిజర్వేషన్ చట్టాన్ని 9వ షెడ్యూల్లో చేర్చే విషయంలో తన ఆందోళనలకు ప్రజాస్వామ్యవాదులు వెనుకబడిన వర్గాల మద్దతు కూడగట్టి పార్లమెంటులో తమ పార్టీ ద్వారా బిల్లు ప్రవేశపెట్టించి ఆమోదం తెలిపేలా చేయాలి. ఒకవేళ అలా జరగకపోతే 1992లో 'ఇందిరా సహాని వర్సెస్ భారత ప్రభుత్వం' కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెబుతూ అనివార్య పరిస్థితుల్లో బీసీ రిజర్వేషన్లు 50 శాతానికి పైబడి పెంచు కోవచ్చని.. కానీ గణాంకాలు కచ్చితంగా ఉండాలని చెప్పడం జరిగింది. కులగణన రిపోర్ట్ కనుగుణంగా మండల కమిషన్ సూచించిన 40 సిఫార్సులను అమలు చేయాలి. అప్పుడే జనగణనలో కులగణన చేపట్టిన దానికి సార్ధకత చేకూరుతుంది.

-ఉజ్జిని రత్నాకర్ రావు

94909 52646

Next Story