- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నానో యూరియాపై ప్రచారం కల్పించండి!
భారతదేశం వ్యవసాయ ప్రధాన దేశం. దేశ ఆర్థిక అభివృద్ధిలో వ్యవసాయానిది కీలక పాత్ర. ఒకప్పుడు వ్యవసాయం

భారతదేశం వ్యవసాయ ప్రధాన దేశం. దేశ ఆర్థిక అభివృద్ధిలో వ్యవసాయానిది కీలక పాత్ర. ఒకప్పుడు వ్యవసాయం ప్రకృతి పద్ధతుల ద్వారానే మొదలైంది. క్రమేణా విప్లవామత్మక మార్పులు చోటు చేసుకొని కొత్త విధానాలు నూతన పంటల రకాలు అధిక దిగుబడినిచ్చే సంకర విత్తనాలు అందుబాటులోకి వచ్చాయి. దాంతో పాటుగా తెగుళ్ల నివారణకు రసాయనాల వాడకం భారీ స్థాయిలో పెరిగింది. అధిక దిగుబడుల ఆశలో అశాస్త్రీయ సేద్య విధానాలు వాడటం వల్ల పెట్టుబడులు పెరిగి, పర్యావరణం దెబ్బ తినడానికి కారణం అవుతున్నాయి. ఇది గమనించిన ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కార్పొరేట్ లిమిటెడ్ ఇఫ్ఫ్కో సంస్థ ప్రపంచంలో తొలి నానో ద్రవ యూరియా ఆవిష్కరించింది. ప్రభుత్వం అయితే నానో యూరియా వలన అనేక లాభాలు ఉన్నాయని ఇది పంటకు బలం చేకూర్చి సాధారణ యూరియా కంటే పంటకు ఎక్కువగా పోషకాలను అందిస్తుందని రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని ప్రభుత్వ ఏజెన్సీలకు, ప్రభుత్వ నమోదిత అగ్రోస్‌లకు, ప్రైవేటు ఫర్టిలైజర్‌లకి సరఫరా చేస్తుంటే ఏడీఎలు, ఎఓలు, ఏఈఓలు, నానో యూరియాపై వినియోగ లాభాలు తెలియపోవుట వలన అన్నదాతలు విముఖత చూపుతున్నారు. ఓ వైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నానో యూరియా వినియోగం ద్వారా యూరియా ఉత్పత్తిలో ఆత్మ నిర్భర్ దిశగా కృషి చేస్తున్నామని, దేశంలో వ్యవసాయ రంగానికి ఈ యూరియా ప్రధాన మైలురాయి అని ప్రశంసలు కురిపిస్తుంటే అగ్రికల్చర్ అధికారులు మాత్రం దీనికి ప్రచారం కల్పించడంలో విఫలం అవుతున్నారు. ప్రభుత్వం రైతులకు వ్యవసాయంపై అవగాహన కల్పించేందుకు రైతు వేదికలు నిర్మించినా కూడా పలువురు అగ్రికల్చర్ అధికారులు అన్నదాతలతో ఏనాడు పంటల సాగు రకాల వివరణపై, పిచికారి మందులపై అవగాహన కల్పించడం లేదని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా వ్యవసాయరంగ అధికారులు రైతులకు నానో యూరియాపై అవగాహన కల్పించి రైతులకు పెట్టుబడి ఖర్చు తగ్గించేలా, పర్యావరణాన్ని కాపాడేలా నానో యూరియా పై అవగాహన కల్పించాలని మేధావులు కోరుతున్నారు.
-బీరవెల్లీ అవినాష్
84659 70894
- Tags
- nano urea






